
RAJA VASIREDDY VENKATADRINAYUDU KATHALU
₹80
In stock · 17 available
PublisherMODUGULA RAVI KRISHNA
LanguageTelugu
మనవి మాటలు - ప్రతి మనిషికీ ఒకరో, యిద్దరో, పలువురో 'హీరోలు' ఉంటారు. వారిలో ఏవో ఉదాత్త లక్షణాలు ఉండటం, లేదా వారిలాగా ఉండాలని భావించటం ఈ 'హీరో ప్రతిష్టాపన' కి కారణం. నాకూ అలా చాలామంది 'హీరోలు' ఉన్నారు. అందులో ఒకరు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. నేను స్వంత డబ్బుతో - రెండు రూపాయలే అనుకోండి-బాపట్లలో సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణంలో కొనుక్కున్న మొదటి పుస్తకం కొడాలి లక్ష్మీనారాయణగారు రాసిన 'రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు'. అయిదేళ్ల వ్యవధిలో ఏడెనిమిదిమార్లు చదివుంటాను, ఆ పుస్తకాన్ని. ఏమిటి నాయుడులో అంతగా ఆకర్షించింది నన్ను! 1. నాయుడు తనకంటే బలవంతులైన ముగ్గురి ఒత్తిడిని తట్టుకోవలసి వచ్చింది. ఫ్రెంచివారి ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్వారి ఈస్టిండియా కంపెనీ, హైదరాబాదు నిజాం-పరస్పర విరుద్ధమైన ఈ మూడు శక్తులతో సామరస్యంగా మెలగిన చతురత నాయుడిది. ఇవికాక దాయాదిపోరు. వీటన్నింటినీ నాయుడు తట్టుకొని నిలబడ్డాడు. 2. నాటికాలపు చాలామంది సాటి జమీందార్లలాగా తన కోటలో బ్రిటిష్వారి పెత్తనాన్ని సహించలేని స్వాభిమాని. వారికి లొంగి ఉండక తప్పదు, లొంగి ఉన్నట్లు కనబడటం తనకు తలవొంపులు. అందుకని ఆంగ్లేయ సైన్యం ప్రవేశించిన పెద్దలనాటి చింతపల్లి కోటను విడిచిపెట్టి నూతనంగా అమరావతి పట్టణాన్ని నిర్మించుకున్నాడు. 3.జమీందార్లు కిరీటాలు ధరించరాదు అని ఈస్టిండియా కంపెనీ ఫర్మానా జారీచేస్తే, ధిక్కరిస్తూ కిరీటం చేయించుకోవటమే కాక భుజకీర్తులు కూడా చేయించుకున్నాడు. (నాయుడి చిత్రపటంలో భుజాలపై కనబడేలాంటివి కావు, అమరేశ్వరాలయంలో స్వామికి ఎదురుగా దోసిలిపట్టినట్టు నిలబెట్టించు కున్న తన విగ్రహం భుజాల మీద ఉన్నవి నిజమైన భుజకీర్తులు) ఎదిరించలేని అమరావతి పట్టణ నిర్మాత