RAJANEETHI SASTRAM by A.RAGHAVENDRA Telugu book cover

RAJANEETHI SASTRAM

by A.RAGHAVENDRA

₹50
In stock · 2 available
PublisherLAKSHMI SREENIVASA PUBLICATIONS
LanguageTelugu
రాజనీతి శాస్త్రం మొదటి భాగము 1. భారత రాజ్యాంగం: మౌలిక అంశాలు మహాత్మాగాంధీ తొలిసారిగా 1922 సంవత్సరంలోనే భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని గుర్తించారు. 1936లో తేజ్ పూర్ కాంగ్రెస్ సమావేశంలో ఒక రాజ్యాంగసభ ఏర్పాటుచేయాలని నిర్ణయించటం జరిగింది. స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే భారత ప్రజలు 1946 డిసెంబరు 9వ తేదీన రాజ్యాంగ పరి వత్తును ఏర్పాటుచేసుకున్నారు. ఈ పరిషత్ తొలి సమావేశంలో సచ్చిదానందసిన్హా తాత్కాలిక అధ్యక్షునిగా ఎంపికయ్యారు. డిసెంబరు 11, 1946నాడు శాశ్వత అధ్యక్షు నిగా బాబూ రాజేంద్రప్రసాద్ ఎంపికయ్యారు. నిర్వహించవలసిన కార్యక్రమం చాలా విస్తృతంగా ఉండటంవల్ల కొన్ని కమిటీ లను ఏర్పాటుచేయటం జరిగింది. ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డా॥ అంబే దూర్, నియమావళి కమిటీకి మరియు సారథ్య సంఘానికి రాజేంద్రప్రసాద్ అధ్యక్షు నిగా, సలహా సంఘం మరియు రాష్ట్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షునిగా వల్లభాయి పటేల్, కేంద్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షునిగా జవర్లాల్ నెహ్రూ, అల్పసంఖ్యాక రక్షణ కమిటీ అధ్యక్షునిగా హెచ్.సి. ముఖర్జీలు పనిచేశారు. భారత రాజ్యాంగాన్ని 26 నవంబరు, 1949న ఆమోదించారు. ఈ రాజ్యాం గాన్ని ఆమోదించటానికి పట్టిన మొత్తం కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అమలులోకి వచ్చే నాటికి 345 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ ఉన్న భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఈనాడు 400కు పైగా ప్రకటనలు, 12 షెడ్యూల్స్ మన రాజ్యాంగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగం రాజ్యాంగం అంటే రాజ్యం యొక్క మౌలిక స్వభావాన్ని, దాని లక్ష్యాలను అమలుచేసే ప్రభుత్వ నిర్మాణాన్ని, విధులను వివరించే నియమ నిబంధనల సంపుటి. ఏ ప్రజాస్వామిక దేశానికైనా రాజ్యాంగం అవసరం. స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశానికి రాజ్యాంగం లేదు. ప్రజల త్యాగ ఫలితంగా 15 ఆగస్టు 1947 నాడు మన దేశానికి స్వాతంత్ర్యం సిద్దించింది. దేశానికనుకూలమైన ప్రభుత్వ విధానాన్ని రూపొం దించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తు అవసరమైంది.