RAJANI GANDHA by PUSALA RAJANI GANGADHAR Telugu book cover

RAJANI GANDHA

by PUSALA RAJANI GANGADHAR

₹100
In stock · 8 available
PublisherPUSALA RAJANI GANGADHAR
LanguageTelugu
సాహిత్యకళలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో గీతాలకు అగ్రస్థానం ఉంది. ఎందుకంటే పండిత పామరులను సైతం రంజింపజేసే శక్తి ఒక్క పాటకు మాత్రమే ఉంది. సంగీతం సాహిత్యం మానవ జీవన వికాసానికి రెండు నేత్రాలుగా మారి దారి చూపిస్తున్నాయి. అందుకే ఎందరో సాహిత్యకారులు అనేకంగా, అపురూపమైన గీతాలను రచిస్తూనే ఉన్నారు. కానీ గీత రచన అంత శులభమైన పనికాదు. గీత రచన చేసేటప్పుడు అనేక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పద్యరచనకు అనేక వ్యాకరణ నిబంధనలు ఉన్నట్లే గీతాలకూ ఉంటాయి. ఈ నియమాలు పాటించి, రచించబడిన పాటలు స్వరకల్పన యోగ్యమైయుండి. గాన యోగ్యంగా మారుతాయి. గీత రచనకు ముఖ్యంగా కావాల్సినవి- భాషపైన సాధికారత, భావుకత, స్పందించే తత్వం, ప్రకృతిని పరిశీలించే గుణం. ఈ నాలుగు నియమాలు 'పాట' అనే రధానికి నాలుగు చక్రాలు. ఇందులో ఏది లోపించినా ఆ పాట కదలకుండా అక్కడే ఆగిపోతుంది. సాహిత్యేతరుల్లో పాట రచన సులువైన ప్రక్రియ అనే ఒక అపోహ ఉంది. ఇలా పాటను చిన్న చూపు చూస్తున్నవారు నిజంగా అమాయకులే! అసలు పాట ఎందుకు వ్రాయాలి? పాటలేవీ అనుకోకుండా వ్రాయబడవు. అవసరం పాటను వ్రాయిస్తుంది. పాట మనిషి జీవితంతో ముడిపడి ఉంది. మనిషి పాటలను ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతాయి. ఒక్క వందేమాతర గీతం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించి పారద్రోలగలిగింది. పాటకున్న శక్తిని దేనితోను పోల్చలేము. అయితే పాటను రచించే కవి అత్యంత ప్రతిభతో కూడిన శక్తిమంతుడై ఉండాలి. అలాంటి వారి పాటలనే ప్రతిరోజు మనం పాడుకుంటున్నాము. ఉత్తమ సాహిత్యాన్ని పొదవుకున్న పాట అజరామరమై నిలుస్తుంది. అలాంటి పాట యుగయుగాల చరిత్రకు సాక్షీభూతమై నిలుస్తుంది. అలాంటి పాటలను సృష్టించిన కవులు మన దేశంలో కొందరు మాత్రమే ఉన్నారు. ఆ కొందర్నే ఆరాధ్యదైవాలుగా కొలుస్తున్నారు సాహిత్య ప్రియులు. అలాంటి వారిలో పూసల రజనీగంగాధర్ గారు ఒకరు.