
RAJARAJANARENDRA
₹90
In stock · 289 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400415
వేంగీచాళుక్య మేరునగధీర రాజరాజనరేంద్ర ఈమని శివనాగిరెడ్డి – స్థపతి గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వలివేరు గ్రామంలో 1955లో పుట్టిన శివనాగిరెడ్డి, తిరుపతిలోని శిల్పకళాశాలలో సాంప్రదాయ వాస్తు ఆలయ శిల్పకళలో నాలుగేళ్లు శిక్షణ పొంది ఎస్వీ యూనివర్సిటీ నుంచి బీకాం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎం.ఎ.. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో పి హెచ్ డి పట్టాలను పొందారు. 1978లో దేవదాయ శాఖలోనూ, 1981 నుంచి రాష్ట్ర పురావస్తు శాఖలోనూ స్థపతిగా పనిచేసి 2013లో పదవీ విరమణ చేశారు. చరిత్ర, శాసనాలు, పురావస్తు శాస్త్రం, పర్యాటకం, బౌద్ధం... వీటిపై అనేక పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపుకు గురైన క్రీ.శ.7-17 శతాబ్దాలకు చెందిన 100కు పైగా దేవాలయాలను తొలగించి, ఎగువన పునర్నిర్మించారు. 2004 నుంచి 2008 వరకూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా, డీన్ గా. 2010-11లో డైరెక్టర్ గా పనిచేశారు. 2013 నుంచి 2015 ఫిబ్రవరి వరకూ స్టేట్ ఆర్ట్ గాలరీ డైరెక్టరుగా, ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. 2015 మార్చి నుంచి మాలక్ష్మీ గ్రూప్కు చెందిన ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవోగా పనిచేస్తున్నారు. ISBN: 978-93-91400-41-5 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 9789391 400415