
RAJASRI - RACHANAGARAM LO ANDALA RAJAKUMARI
₹200
In stock · 100 available
PublisherYAITLA KISHORE KUMAR
LanguageTelugu
మనసులో మాట రాజమందిరాల రాగవిలాసాల తేలిన అందాల రాజకుమారి, రస జగాలలో రతీదేవిలా విహరించిన అభినయ విలాసిని, కరకు కత్తులను ఎదిరించి నిలిచిన వీరులను కనుసన్నలతో అదిలించిన రాణివాసం, అరవీరులను సైతం వలపు శరాలతో బంధించిన యువరాణి, స్వాప్తిక లోకాల, స్వర్గభోగాల రసరాగాల తేలించిన అనురాగిణి, తెలుగు సినీ స్వర్ణయుగంలో అందాల రాజకుమారి, దక్షిణాపద ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిరునవ్వుల సుకుమారి కుసుమకుమారి. వెండితెరపై రాజలాంచనాలతో, రాగ భోగాలతో వెలుగొందిన "రాజశ్రీ ". విసిగివేసారిన మానవ హృదయాలను స్వాప్తిక లోకంలో తేలించేవి జానపద కథలు, ఆ కథలకు అందమైన దృశ్య రూపాలు ఇచ్చి వెండితెరపై బంగారు కాంతులతో ఆవిష్కరిస్తే, ఆ దృశ్యరూపాలలో సుందర, సుకుమార, సోయగాలతో, రాచకలలతో సాక్షాత్కరించిన అపురూప అభినయనాయకి రాజశ్రీ, 60వ దశకంలో ఆమె లేని జానపద చిత్రం లేదు. అందాలు యువరాణిగా, ఉరకలు వేసి అడవి పిల్లగా, రాజమందిరాలలో వెలిగిన రాకుమారిగా, గంధర్వకళలతో వెలుగొందిన దేవకన్య. యక్ష రాజకుమారి చంద్రకళగా, వనసీమలో విహరించే అందాల రోజా గా, రాచకళలతో వెలిగిన యువరాణి, వాసవీ దేవిగా, గంధర్వ కన్య సౌధామినిగా, గోపాలుడుని మురిపించిన పద్మావతి దేవిగా, అమాయకత్వంతో అలరించిన సింగారిగా, ప్రజావిప్లవ యోధురాలు నందినిగా, ఆమె రూపశిల్పం పై దశాబ్దంపైగా ప్రేక్షకులను అలరించిన జానపద పాత్రలు. జానపదాలే కాకుండా అపురూపమైన పౌరాణిక పాత్రలు, సరదా సరదాగా సాగే సాంఘిక పాత్రలు కలబోసుకుని పదిహేడు వసంతాల పాటు దక్షిణాపద ప్రేక్షకులను మురిపించిన వెండితెర రాజకుమారి “ రాజశ్రీ" గారి గురించి ఈనాటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో నేనుచేస్తున్న చిరు ప్రయత్నమే ఈ రాచనగరులో అందాల రాజకుమారి - రాజశ్రీ