RAJAYOGAMRUTHA SARAMU by T.T.D. DEVASTANAM PRACHURANAM Telugu book cover

RAJAYOGAMRUTHA SARAMU

by T.T.D. DEVASTANAM PRACHURANAM

₹25
In stock · 3 available
PublisherT.T.D. DEVASTANAM PRACHURANAM
LanguageTelugu
నా మాట 'యోగ' మంటే జీవాత్మ పరమాత్మల సంయోగం. అదే కైవల్యం. అది సిద్ధించటానికి తొలుదొలుత చిత్తవృత్తిని నిగ్రహించాలి. కాబట్టి, చిత్తవృత్తిని నిగ్రహించటమే యోగానికి మొదటి మెట్టు. 'యోగదర్శనం' సుప్రసిద్ధాలైన షడ్దర్శనాల్లో ఒకటి. ఈ దర్శనానికి ఆద్యుడు పతంజలి మహర్షి. తెలుగులో వ్రేళ్లపై లెక్క పెట్టదగిన యోగశాస్త్ర గ్రంథాల్లో తరిగొండ వెంగమాంబ రచనలకు ఒక ప్రత్యేకత ఉంది. తొలుత యోగినియై, యోగశక్తి ద్వారా అప్రయత్నసిద్ధంగా కవితాకళను పొందిన ఈ భక్త కవయిత్రి తన రచనల్లో స్వానుభవ జనిత జ్ఞానాన్ని నిక్షేపించి, సులభ శైలిలో, సుబోధంగా కావ్యరచన కావించియున్నారు. అలాంటి రచనల్లో ఈ “రాజయోగామృతసారం” అగ్రగణ్యమైనది. యోగసాధనలలో ఉత్తమమైనది రాజయోగం. రాజయోగం యొక్క సారాంశాన్ని సంగ్రహంగా తేట తెలుగు ద్విపదల్లో వివరిస్తూ వున్న ఈ గ్రంథం పరిమితిలో చిన్నదయినా, ప్రభావశాలి యైనటు వంటిది!