RAJITHAM by B.P.KARUNAKARAN Telugu book cover

RAJITHAM

by B.P.KARUNAKARAN

₹60
In stock · 7 available
PublisherB.P.KARUNAKARAN
LanguageTelugu
తడిగుడ్డ వేడి ప్రియమయిన నాన్నకు, మీకు, అమ్మకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నేనెంతో బాధపడుతున్నాను. రాకుండా ఉండవలసింది. వచ్చేసి మీ మనసులకు ఎంతో కష్టం కలిగించినందుకు క్షమించమని వేడుకుంటున్నాను. ముందే చెబితే మీరే కాదు, ఎవరూ ఒప్పుకుని ఉండేవారు కాదు. నాకు ఇరవయి సంవత్సరాల వయసు వచ్చినా మీకు ఏవిధంగా ఉపయోగం పడలేక పోతున్నాను. ఇంట్లో తిని ఊరంతా బలాదూర్గా తిరగడమే అయిపోతుంది. ఎస్.ఎస్.సి నాలుగుసార్లు తప్పడం వలన నా మీద నాకు నమ్మకం పోయింది. పూర్తి చేస్తానన్న నమ్మకం లేక మళ్ళీ కూర్చోలేదు. నా స్నేహితుల తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. కొంతమంది మంచిగా కాలేజీలో చదువుకుంటున్నారు. మరి కొంతమంది చిన్నా చితకా ఉద్యోగాల్లో చేరిపోయారు. ఏం కాకుండా పోయింది నేనే అనుకుంటాను. అందరూ నిద్రపోయాక దొంగలా ఇంట్లోకొచ్చి శబ్దం కాకుండా భోజనం చేస్తుండేప్పుడు ఏడుపు వస్తూండేది. నా నీడ తమ్ముడి మీద, చెల్లిమీద పడకూడదనే ఇంతదూరం వచ్చేశాను. వాళ్ళు నాలా కాకుండా బాగా చదువుకోవాలి. నీకు, అమ్మకు పేరు తేవాలి. నేనింతకు మించి ఏం, కోరుకోవడంలేదు. మన ఊరికి ఈఊరు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత చిన్న పనికి ఇంత దూరం రావాల్సిన పనిలేదు. ఇటువంటి పని మనింటి చుట్టుపక్కల ఊళ్లో ఎక్కడయినా దొరుకుతుంది. నా మూలాన మీరు చిన్న చూపు చూడబడకూడదు. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. మీరు, అమ్మ, తమ్ముడు, చెల్లి మాటిమాటికి గుర్తు వస్తూంటారు. గుర్తు వచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంటుంది. నాన్నా, అమ్మ పిచ్చిది. లోకం ఏమీ తెలియదు. అమ్మను కొట్టకండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. వద్దు నాన్నా వద్దు. నేను ప్రస్తుతం ఒక కాకా హోటల్లో పనిచేస్తున్నాను.