RAJYA KANKSHA JANAPADA NATIKA by PATTELA RAMAKOTESWARA RAO Telugu book cover

RAJYA KANKSHA JANAPADA NATIKA

by PATTELA RAMAKOTESWARA RAO

₹45
In stock · 5 available
PublisherPATTELA RAMAKOTESWARA RAO
LanguageTelugu
“మనవి' ఈ నాటికను ప్రదర్శించువారు ముందుగా నా అభిప్రాయం తెలుసు కొనుట కొంత శ్రేయస్కరం. తదుపరి ఈ నాటిక యొక్క సర్వ హక్కులు నావే గనుక ముందుగా నాకు తెలియ పరచి ప్రదర్శించుట చిన్న మర్యాద. ఇలాగని ఈ నాటిక ప్రధమ ముద్రణ గావించిన 1965 వ సం లో ప్రకటించడం జరిగినది. ఆ తరువాత దీని ద్వితీయ ముద్రణ నలభై ఏడు సంవత్సరముల తరువాత జరుగు చున్నది! అప్పటి ముద్రణ కేవలం ప్రదర్శనకు మాత్రమే యోగ్యత గలదిగా వ్రాసి ప్రచురించడం జరిగినది. దానిని మరలా ద్వితీయ ముద్రణ గావించ వలెననెడి సత్సంకల్పం మనసులో కలిగి... కొంత మార్పులతో-అంటే అప్పటి డైలాగులన్నియును యధా తధము గనే ఉంచి,దానికి కొంత వివరణాత్మక విశ్లేషణను జతకూర్చి, పాఠక ప్రియులు మామూలుగా చదువు కొనుటకు కూడా యోగ్యత కలుగు లాగున రూపు గావించి, ముద్రణ గావించిడం జరిగినది. నా ఈ ప్రయత్నం సరైనదా- కాదా అనెడి నిర్ణయం పాఠకులకు మాత్రమే వదలి వేయు చున్నాను. ఏది ఏమైన కళా ప్రపంచం అనెడి ప్రదేశం ఎంతో సువిశాలమైనది, అతి విశిష్ట మైనది గనుక ఎన్నిరూపాలు దాల్చిన కవితల నైనా,మరెన్నో రూపాంతరాలు చెందిన రచనలనైనా, హాయిగా సేద దీర్చు కొనుటకు అనువగు చోటును ఆదరంతో అందించడం జరుగుతుంది గనుక... ఇలాగ ఎన్నెన్ని మార్పులతో వ్రాసి ముద్రణ గావించినను, అందులో ఏమాత్రం కూడ అభిరుచి చెడకుండగా చేసి, రచనా సామర్థ్యము లోపించ కుండగా రూపు గావించిన, తధాస్తు దేవతలు దీవించ గలరని, పాఠక దేవుళ్ళు పోత్సహించగలరనే ప్రగాఢ నమ్మకంతోనే, నా యీ ప్రయత్నము, తాప త్రయం కూడా!