
RAJYAM MATHAM KORTULU HAKKULU
₹200
In stock · 11 available
PublisherALAPATI SURESH KUMAR
LanguageTelugu
ISBN9789357802161
ముందుమాట రాజ్యాంగం అనేది కేవలం న్యాయమూర్తులకు సంబంధించిన వ్యవహారం అనుకోవడం పొరపాటు. రాజ్యాంగ సూత్రాల విశ్లేషణ, తాత్పర్యం.. దాని విలువల చట్రాన్ని ఎలా చిత్రిక పడుతున్నారన్న మీమాంస కూడా అంతే. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం ద్వారా అధికారాన్ని అందుకున్న వారు దానిని దుర్వినియోగం చేయకుండా చూడడం రాజ్యాంగం ప్రాధమిక విధుల్లో ఒకటయినట్లయితే ఆ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉంది. అయితే ఉమ్మడి నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాల లోతుపాతులనూ, ఆధిక్యతావాద పెత్తందార్ల వత్తిళ్లను అంతం చేయాల్సిన అవసరాన్నీ అర్థం చేసుకునేందుకు కావాల్సిన సామాజిక అనుకూలతలూ, విద్యాసంపదా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేవు. ప్రజాస్వామ్యాలు ఆధిక్యతావాద మూకస్వామ్యాలుగా మారే ప్రమాదం దీని నుంచే పుడుతుంది. ఆధిక్యతావాదం అంతరంగంలో ఎల్లప్పుడూ పొంచి ఉండే విచ్ఛిన్న శక్తులకు లొంగిపోవాలన్న ప్రలోభాన్ని ప్రతిఘటించడం కొంచెం కష్టమే. విజయానికి ఒక వోటు మెజారిటీ అయినా సరిపోయే వ్యవస్థలో ఆ విజయంతో తమ స్థాయిని లెక్కించుకునే రాజకీయవాదులకు మరీ కష్టం. ప్రజా జీవితం అంతిమ లక్ష్యంలోకి నయా ఉదారవాదం చొచ్చుకెళ్లిన తర్వాత దురాశే రాజకీయ ఆర్ధికవ్యవస్థ అసలైన పునాదిగా, నీతిగా మారుతుంది. జన బాహుళ్యం ప్రయోజనాలను పణంగా పెట్టి కొద్ది మందికి లాభం కలిగించడాన్నే మంచి పనిగా రాజకీయవాదులు చిత్రించగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతులేని దాహంతో జాతి సంపదను కొల్లగొట్టే శక్తుల రక్షణకు పనికి వచ్చే వ్యవస్థలను చట్టం వెలుపల, చట్టం లోపల నిర్మించాల్సి వస్తుంది. వాటిని సహజమైన విషయాలుగా, న్యాయమైన సామాజిక కూర్పుగా చిత్రిస్తారు. ఆ వ్యవస్థలు స్థిరంగా కొనసాగడం కోసం సమాజంలోని చీలికలనూ, ప్రాచీన విద్వేషాలనూ రగిలిస్తారు. విచ్వేషంతో నిండిన సామాజిక అస్థిత్వాల ప్రాతిపదికపై చీలిపోయిన ప్రజలు నిరంతరాయంగా పరస్పరం తారసిల్లేట్లు చేస్తారు. చదువులేని వారికీ, పేదలకూ సామాజిక న్యాయం లభించడానికి ఉపకరించే వేదికను రూపొందించాలన్న నయా ఉతారవాద సిద్ధాంతకర్తల లక్ష్య సాధనను అసాధ్యంగా మారుస్తారు. ఈ క్రమంలో సామాజిక ఐక్యతనూ, ఆయా వర్గాల మధ్య ఉండే పరస్పర విశ్వాసాన్నీ తెంచడానికి కూడా వెనుదీయరు.