RAKTASRUVULU by SAHAVASI Telugu book cover

RAKTASRUVULU

by SAHAVASI

₹180
In stock · 676 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
THE SCALPEL, THE SWORD (English) - Sydney Gordon & Ted Allan RAKTASRUVULU (Telugu) - Sahavasi స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో, అంతర్జాతీయతా చైతన్యంతో ఆ లక్ష్య సాధనకోసం అవిరళ కృషిచేసి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డా|| బెతూన్ జీవిత కథే “రక్తాశ్రువులు". సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన “The Scalpel, The sword" కు ఇది సంక్షిప్తానువాదం. మూలంలోని పట్టు సడలనీకుండా, శ్రద్ధ- బాధ్యతల్ని రెండు కళ్ళుగా పెట్టుకుని తెనిగింపులో స్వల్పంగా స్వేచ్ఛ తీసుకుని సంక్షిప్తపర్చి సమర్పిస్తున్నాం. యానాన్లో వున్న డా॥ 'మా'కు రాసిన ఒక లేఖలో డాక్టర్ బెతూన్ "నెత్తురు, కన్నీళ్ళతో తడిసిన దారివెంట పయనిస్తున్నాం" అని తెలిపాడు. నెత్తురు కారే గాయాల్ని, కన్నీళ్ళు కారే నయనాల్ని తుడుస్తూ ఆయన తుది నిశ్వాసం వొదిలాడు. అందుకే ఈ పుస్తకానికి "రక్తాశ్రువులు" అని పేరు పెట్టాం. శ్రీ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004