
RAMA MARGAM
₹250
In stock · 5 available
PublisherINAGANTI (NARLA)LAVAYNA
LanguageTelugu
'రామనామ మహిమ' దగ్గర నుంచి ప్రారంభించి రాముడి వ్యక్తిత్వం, రామరాజ్య స్వరూపం, సీతాచరితం, పితృభక్తి, సోదరప్రేమ, మైత్రి, హనుమత్ దర్శనం వంటి విభిన్న పార్శ్వాలను విశ్లేషిస్తూ సాగింది ఈ రచన... ...ఒక్క రాముడి వ్యక్తిత్వం ఈ రచయిత్రికి 16 కోణాలలో దర్శనమైంది. అలాగే సీతాదేవి వ్యక్తిత్వాన్ని ఎనిమిది కోణాలలో దర్శించారు. రామరాజ్యం గురించి ఏడు విధాలుగా ఆమె వర్ణించారు. రామాయణంలో సోదరులజంట, భార్యభర్తలజంట, మిత్రులజంట, గురుశిష్యులజంట వంటి విభిన్న పాత్రల సమూహాలను ఆమె విశ్లేషించారు. ...ఇక హనుమంతుని పాత్రలోని విశిష్టతల గురించి ఎన్నిరకాలుగా విశ్లేషిస్తే సమగ్రమవుతుంది? ఒక గ్రంథం సరిపోదు. అయినా, ఆయన చాకచక్యత, సమయస్ఫూర్తి ఇలా అరుదైన ఎన్నో అంశాలను అయిదు పార్శ్వాలలో ఆమె తన శక్తి మేరకు పరిశీలించారు. బుద్ధికుశలత, కార్యదీక్షత, వినయం, శౌర్యం అంటూ మరికొన్ని అధ్యాయాలలో 'హనుమ' వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని వర్ణించారు. ఇలా పాత్రల గురించి వర్ణిస్తూ క్రౌంచపక్షులజంటపై బోయవాడు సంధించిన బాణానికి వాల్మీకి హృదయం ఎలా స్పందించిందది దగ్గర నుంచి ఉత్తర రామచరితంలో సీతాదేవి అంతర్ధానమవుతూ భూదేవిని ప్రార్థించే సమయంలో రాముడికి కలిగిన ఉద్విగ్నభావాలవరకు గల ముఖ్య ఘట్టాలను వర్ణించారు. ఇంతటి ప్రయత్నం, ప్రయోగం చేసిన శ్రీమతి డా॥ లావణ్య కుటుంబానికి మా ఆశీస్సులు. శ్రీ సీతారామచంద్రులమంగళాశీస్సులు. స్వామి పరిస్థర్వానంద