
RAMA NEE KATHA VINUMA
₹80
In stock · 30 available
PublisherM.K.PRABHAVATHI
LanguageTelugu
ఉపోద్ఘాతము "రామా నీ కథా వినుమా" అను పద్య కావ్యము "రామా" అను మకుటంతో అవధాన భారతి శ్రీమతి ఎం.కె.ప్రభావతి గారు రచించారు. ఇందులో 10 కందపద్యాలు కృతికర్త వంశావళిని గూర్చి, "రామా నీకథ వినుమా” అను శీర్షికతో 125 కంద పద్యాలు, 6 సీస పద్యాలతో లఘు రామాయణము ఉన్నది. ఈ రామాయణ కావ్యకర్త శ్రీమతి ప్రభావతిగారు నేటి సుప్రసిద్ధ మహిళాష్టావధాని. ఈమె 93 కి పైగా అష్టావధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పట్టణాలలోను, గ్రామాలలోను ఆంధ్రీతర ప్రాంతాలైన తమిళ, కర్ణాటక రాష్ట్రాలలోను, ఢిల్లీలోను నిరాక్షేపంగాను, విజయవంతంగాను ప్రదర్శించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆమెకు ప్రతిభా పురస్కారం ప్రసాదించి గౌరవించారు. ఈమె విద్యావంతురాలు. ఖాజీపేట, గుంతకల్ మొదలైన స్థలాలలోని రైల్వే విద్యాలయాలలో ఉద్యోగించారు. ఉపాధ్యాయురాలుగా, ప్రధానోపాధ్యాయినిగా కూడా మంచి ఖ్యాతి నార్జించారు. "రామా నీ కథ వినుమా" అను రామాయణ గ్రంథానికి పూర్వం ఈమె "శ్రీనరసింహ శతకము"ను రచించారు. తెలుగువారికి రామాయణము. మహాభారతము, మహాభాగవతము, భగవద్గీత ప్రధాన పవిత్ర గ్రంథాలు. రామాయణము ప్రజలకు మానవ విలువలు, సంబంధాలు తెలిపే మహాకావ్యము. సంస్కృతంలో వాల్మీకి రామాయణము. కాళిదాసు రఘువంశము, పలునాటకాలు, తెలుగులో రంగనాథ రామాయణము, గోపీనాథ రామాయణము మొదలైనవి. ఆధునిక కాలంలో పలువురు రామాయణాలు రచించినా విశ్వనాథ వారి "రామాయణ కల్ప వృక్షము" ప్రసిద్ధినందింది మహిళా రచయితలలో మొల్ల రామాయణం తరువాత ప్రభావతి గారి కంద పద్యాలలోనున్న ప్రభావతిగారి రామాయణాన్నే పేర్కొనాలి. కంద పద్యాలలో కావ్యం వ్రాయడం కష్టంతో కూడుకొన్నది. దానికి కారణం. కంద పద్యానికి ఛందస్సుకు సంబంధించిన అనేక నియమాలున్నాయి. రామా నీ కథ వినుమా