RAMATATWAMU by CHAVALI ANJANEYAMURTHY Telugu book cover

RAMATATWAMU

by CHAVALI ANJANEYAMURTHY

₹40
In stock · 7 available
PublisherCHAVALI ANJANEYAMURTHY
LanguageTelugu
శ్రీరామాయణ ప్రశస్తి కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ఆరుహ్య కవితా శాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్ వాల్మీకి మహర్షి అనే కోయిల కవిత్వమనే చెట్టుకొమ్మనెక్కి “రామ రామ” అనే మధురాక్షరాలు కూయుచుండెనని భావం. వాల్మీకి మనకిచ్చిన ఆది కావ్యము రామాయణము పవిత్ర గ్రంథము. ధర్మ మార్గ సూచకము. వేదోపనిషత్తుల సారం, మర్యాదా పురుషోత్తముడైన రామ చంద్రుని దివ్య లీలలు ఇందు వర్ణించబడినవి. మాయామానుష విగ్రహుడు రాముడైతే, లీలామానుష విగ్రహుడు కృష్ణుడు. రామునిలా మనము ప్రవర్తించాలి అనేది రామాయణ సారాంశం. (రామవత్ వర్తితవ్యం) రామాయణం అంటే రామస్య అయనం. రాముని యొక్క చరిత్ర (కథ) అని అర్థం. దీనినే సీతాయాశ్చరితమని, పౌలస్త్యవధ అని కూడా పేర్కొన వచ్చునని వాల్మీకి తెలిపెను. అయన శబ్దానికి మార్గము, గమనము అని కూడా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థంలో రామాయణం అంటే రాముని మార్గం అంటే రామతత్వాన్ని తెలియజేసేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, 16ఏళ్ళకే విశ్వామిత్రునితో పయనం, రాక్షసవధ, అహల్యా శాప విమోచనం, సీతా కళ్యాణం, వనవాసం, సీతాపహరణం, రావణుని వధ ఇలా తన జీవితంలో అనేక కష్టాలు పడ్డాడు రామచంద్రుడు. అయినా సత్య ధర్మాలను వదలని రాముని జీవన గమనం మనందరికి ఆదర్శప్రాయం. "రమ్” ధాతువునకు 'రమించుట', 'ఆనందపడుట' అని కూడా అర్ధాలు ఉన్నాయి. ఈ అర్థంలో రామాయణమంటే సంసార జీవితంలో కొట్టుమిట్టాడే మానవులకు ఆనందాన్ని కలిగించేదని అర్థం. రామాయాఃఅయనం అనే అర్ధంలో రామ అంటే సీతాదేవి. కష్ట సుఖాల్లో భర్తను అనుసరించిన సీతాదేవి చరిత్ర అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు.