
RAMAYANA RATNALU
by K.RAVAMMA
₹50
In stock · 35 available
PublisherK.RAVAMMA
LanguageTelugu
రామాయణం రాముని దివ్యచరితము మాత్రమే కాదు, ఘనశీలవతి సీతకథ కూడా. నూరుకోట్ల శ్లోకాల సంపుటి అని ప్రతీతి. వాటిలో కనీసము ఒక శ్లోకమైనా పాదమైనా, అక్షరమైనా మనసు పెట్టి చదివినా, చదవాలని తలచినా చాలును. వింటే, వినాలని తలచినా చాలును. ప్రతీ అక్షరమూ మహాపాతక నాశకమవుతుంది. వేదవేద్యుడైన భగవంతుడు అయోధ్యానగరంలో శ్రీరామచంద్రునిగా ఆవిర్భవించగా వేదము అతని జీవన విధాన సారాంశం వివరించే రామాయణగాథకు ఆత్మగా అవతరించిందని పురాణవాక్యము. అలనాడు త్రేతాయుగములో బ్రహ్మ ఆదేశానుసారము నారదుని ఉపదేశము పొంది వాల్మీకి రామాయణగాథను 24,000 శ్లోకాలలో రమణీయంగా రూపుదిద్దాడు. అందులోని ప్రతి శ్లోకమూ ఒకరత్నమే. రామాయణములోని ప్రతి సంఘటనను మన కుటుంబ జీవనానికి అన్వయించవచ్చు.