
RAMPANDU LEELALU HASYA KATHALU
by M.B.S PRASAD
₹60
In stock · 194 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
+ 'అచలపతి కథలు', థ్రిల్లింగ్ కథలు', 'కిశోర్ జీవనఝరి' 'హిస్టరీ మేడీజీ' 'కాగితాల బొత్తి' 'పొగబోతు భార్య' తెలుగులో, ఇంగ్లీషులో - డైరక్టు కథలు, అనువాదాలు చరిత్ర, కళ, రాజకీయం- అంశాలపై వ్యాసాలు, ఫీచర్లు 8 సంపుటాల ' ముళ్లపూడి సాహితీ సర్వస్వం'కు సంపాదకత్వం మేనేజింగ్ ఎడిటర్గా 'హాసం' హాస్య- సంగీత పత్రికకు సారథ్యం 350కు పైగా వైవిధ్యభరితమైన రచనలు 'వరల్డ్స్ స్పేస్' శాటిలైట్ రేడియోలో 'పడకుర్చీ కబుర్లు' ఎమ్బీయస్ ప్రసాద్ రచయిత ఆంగ్ల సాహిత్యంలో హాస్యరస రాజ్యాధినేత ఉడ్ హౌస్ సృష్టించిన జీవ్స్, వూస్టర్, బింగో లిటిల్, ఫ్రెడ్డీ వగైరా పాత్రల స్ఫూర్తితో తెలుగు వాతావరణంలో నడిచిన 17 హాస్య కథలు 'హాసం' పత్రికలో ధారావాహికంగా వెలువడిన కథలు -ఇప్పుడు పుస్తకరూపంలో..... * ...రాంపండు ప్రేమకి అంతంలేదు. అది అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇతనో ఏకలవ్యుడు. ఏకకాలంలో అనేకమందిని ప్రేమించడు. ఒకరి తరువాత ఒకర్ని ప్రేమిస్తాడు. కృష్ణుడు అల్లా కాదు. ఏకకాలంలో ఎంతోమందిని ప్రేమిస్తాడు. ఆ లీలామృతాలని మనం చిన్నప్పటి నుంచి గ్రోలుతూనే ఉన్నాం. ఈ రాంపండు లీలలు పాపము అటువంటివి కావు. పాపం! రాంపండు లీలలు మనకి జాలి కలిగిస్తాయి. 'అనంతంకి' కి అవి కోపం తెప్పిస్తాయి. అచలపతి, ఆ లీలలను రక్తి కట్టిస్తూ ఉంటాడు మనకోసం... * ...ఈ రచనలు మనల్ని అసాంతం చదివిస్తాయి, అలరిస్తాయి. కొని చదివినందుకు శ్రీ సంతోషిస్తాం. కనుక మీరు కొనవచ్చునని సిఫార్సు చేస్తున్నాను... * ...'నేను' మేస్టర్ని. ఎమ్బీయస్ ప్రసాద్కి కేవలం ఫస్ట్ క్లాస్ కాక డిస్టింక్షన్ ఇస్తున్నాను. ...ముందుమాటలో ప్రసిద్ధ రచయిత కవనశర్మ VPH01100484