RAMUDIKI SEETA YEMAVUTHUNDI - 100.00 by ARUDRA Telugu book cover

RAMUDIKI SEETA YEMAVUTHUNDI - 100.00

by ARUDRA

₹100
In stock · 575 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సీతమ్మతో ఆరుద్ర ! రాముడికి సీత ఏమవుతుంది? అనేది తెలివితక్కువ ప్రశ్న కాదు. ఈ ప్రశ్నను తరచి, తరచి, సాంగోపాంగంగా చర్చిస్తే, ఎన్నెన్నో రామకథలు బయట పడ్డాయి. ఇన్ని రామాయణాలను చదివి చదివి వాటిలోని వావివరసల్ని విశ్లేషిస్తూ, కేవలం హరిదాసులు చెప్పే రామాయణాన్ని మాత్రమే విశ్వసించి, రామాయణ కథ తరతరాలుగా అనేక మార్పులకు, కూర్పులకు, చేర్పులకు లోనయివస్తూందనే సత్యాన్ని గుర్తించ నిరాకరించే వారికి, రామబాణం లాంటి రచన "రాముడికి సీత ఏమవుతుంది?" అనే వ్యాస పరంపర! రాముడికి సీత ఏమవుతుంది? అనే ప్రశ్నలోనే ఈ సమీక్షలో సీతకు ఎక్కువ ప్రాముఖ్యం వుంది అని వెల్లడి అవుతోంది. రామకథలన్నింటికీ సీతమ్మ కేంద్ర బిందువు. సీతమ్మవారి జన్మ రహస్యాన్ని బట్టి, తీగలాగితే డొంకంతా కదలినట్టు, రామాయణంలోని వావివరుసల ప్రసక్తి, అందిన కథల మేరకు సవిమర్శకంగా, సాధికారికంగా ఈ వ్యాస పరంపరలో ఆరుద్రగారు చర్చించారు. రామభక్తులకు, హరిదాసులకు నిజానికిన్ని రామాయణాలు వున్నవనే సంగతికాని, వాల్మీకి ముందు రామకథల్ని అనేకమైన వాటిని, అనేక చోట్ల, అసంఖ్యాక రీతుల్లో గానం చేసేవారనీ, వాల్మీకి రామ కథలను ఏకత్రం చేసిన ఆదికవిగానే కాక, ఆది ఎడిటర్గా కూడా పాత్రఃస్మరణీయుడనీ, మారుతున్న సమాజానికి అవసరమైన రీతిలో రామాయణం ఎప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వచ్చిందనీ తెలియదు. భక్తికి విశ్వాసంతోగాని, జ్ఞానంతో పనిలేదు. జ్ఞానయోగం కంటె భక్తి యోగం గొప్పది. కాని భక్తులయినా, రక్తులయినా భిన్న భిన్న రామాయణాల్లో సీతాదేవి పుట్టుక గురించి ఏమేమి చెప్పారో తెలుసుకోవడం వలన ఆనందంతోపాటు, ఆశ్చర్యంకూడా కలుగుతుందే కాని, రామాయణం పట్ల, రామకథల పట్ల నిరాదరణ కాని, నిరసన కాని ఈ వ్యాసాలు కలుగజేయవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.