
RAMUDUNDADU RAJJIMVUNDADI-140
₹140
In stock · 377 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696145
కేశవరెడ్డిగారి నవలల్లో మాలల, యానాదుల, బడుగువర్గాల జీవితాలు వాళ్ల పోరాటాలు చోటుచేసుకున్నాయి. అవి చిత్తూరు వంటి ఒకానొక ప్రాంతానికి చెందినవైనా కష్టజీవుల బతుకుపోరు కథ గనుక అది ప్రపంచంలో ఏ కష్టజీవుల జీవన్మరణ పోరాటాన్నైనా ప్రతిఫలిస్తుంది. ప్రకృతి, సమాజం, వ్యక్తి అంతస్సంబంధాలు ఈయన నవలల్లో అపూర్వంగా చిత్రించబడతాయి. వరవరరావు నేటి సమాజంలో కులవృత్తులు క్రమక్రమంగా ధ్వంసమైపోతున్న వైనాన్ని చూపించటం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. ఇందులో దళితులూ ఉన్నారు దళితేతరులూ ఉన్నారు. కొలిమి పని గిట్టుబాటు గాని ఒక కంసాలిని, కట్టుబానిస కొలువు గిట్టుబాటుగాని ఒక కట్టుబానిసను, కూలిపని గిట్టుబాటుగాని ఒక దినకూలిని, వ్యవసాయం గిట్టుబాటు గాని ఒక రైతును ఈ నవలలో చూస్తాం.