
RANGA THARANGALU
₹100
In stock · 5 available
PublisherVADDEPALLI KRISHNA
LanguageTelugu
నేపథ్యం 1960లో నేను 6వ తరగతి విద్యార్థిగా వుండగా, అప్పటి మా తెలుగు టీచర్, సి.నా.రెగారి శిష్యరత్నమైన కనపర్తిగారు ("వాస్తవాలు” గ్రంథ రచయిత) నాచేత 'సినీకవి' (సినారె రచించిన ఏకైక ఏకాంకిక)లో సినీ కథకుడైన 'తారాపతి' పాత్ర వేయించారు. కరీంనగర్లో జరిగిన ఆనాటి జిల్లాస్థాయి నాటికల్లో కూడ మా చేత వేయించగా, పెద్దల అభినందనలందుకున్నాం! అలా చిన్ననాటి నుంచే నాకు తెలియకుండానే 'సినారె' గారితో అనుబంధమేర్పడగా, నేను రంగస్థలానికి నటునిగా పరిచయమై, ఆ తర్వాత హైస్కూల్లో 'ఏడుసున్నాలు', 'పిచ్చిరాజు ఇంటర్వ్యూ', 'త్రిశంకు స్వర్గం', 'లవ్ మ్యారేజ్', 'పేటెంటు మందు' మొదలగు అనేక నాటికల్లో హీరోగానే గాక 'కర్ణ', అశ్వత్థామ, కట్ట బ్రహ్మన, పోతన మొదలైన ఏకపాత్రాభినయాల్లో ప్రతిభావంతంగా నటించి రాణించాను. ‘వాలీబాల్’, 'బ్యాడ్మింటన్' ఆటల్లోనేగాక వక్తృత్వ, వ్యాస రచనల్లో - చదువులోనూ ప్రకాశించి, హెచ్.ఎస్.సిలో ‘స్కూల్ ఫస్ట్'గా నిలిచాను. పి.యు.సి చదివాక మెడిసిన్ సీటు దొరక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరాను. ఆ తర్వాత గేయ రచనలతో (జూన్, 1968) రాణిస్తూనే “అల్లూరి సీతారామరాజు”, “వీరపాండ్య కట్టబ్రహ్మన” నాటకాలకు సన్నివేశ గీతాల్ని రచించడమే గాక ప్రముఖ పాత్రల్నీ పోషించాను. అలా నాటక రంగానికి, సాహిత్యరంగానికి చేరువయ్యాను. ఆనాటి మారుమూల పల్లెల్లో “దొరతనం” ఇంకా చెలరేగుతూ వెట్టిచాకిరితో అట్టుడుకుతుంటే గ్రహించి, "వెలుగచ్చింది” పేరుతో తొలి తెలంగాణా మాండలిక నాటిక 1976లో రచించి దర్శకత్వం వహించి, ప్రథమంగా సిరిసిల్ల ‘రాజేశ్వర టాకీసు'లో ప్రదర్శింపజేశాను. తద్వారా అందరి ప్రశంసలకు పాత్రమయ్యాను. అప్పటి ఎమ్.ఎల్.ఏ జె.నర్సింగరావు (తంగళ్లపల్లి దొర) ఈ నాటికను తిలకించి ఆనందించడమేగాక అభినందించడం విశేషం! ఆ తర్వాత కరీంనగర్ 'కళాభారతి'లో రెండుసార్లు, 1977లో సంభవించిన 'ఉప్పెన బాధితుల సహాయార్థం తిరిగి సిరిసిల్ల జూనియర్ కాలేజిలో మరోసారి ప్రదర్శింపజేస్తూ, సమయానికి అందలి 'కొండయ్య' పాత్ర ధారి లేనందున నేనే నటించి రక్తి కట్టించాను. 'పోలీస్ ఇన్స్పెక్టర్'గా ముందు ఎం.ముత్యంరెడ్డి / (తర్వాత) పి. జయంత్కుమార్, మిత్రుడు జక్కని వెంకటరాజం 'దొర'గా రాణించారు.