RANGANADHA RAMAYANAM KUMBHA RAMAYANAMU by DR.C.MUTYALAPPA Telugu book cover

RANGANADHA RAMAYANAM KUMBHA RAMAYANAMU

by DR.C.MUTYALAPPA

₹195
In stock · 1 available
PublisherDR.C.MUTYALAPPA
LanguageTelugu
1. భారతదేశంలో రామాయణం సంస్కృత సాహిత్యంలో వాల్మీకి రామాయణం భారత దేశంలో ప్రముఖమైన మహా గ్రంథాలు మూడు ఉన్నాయి. అవి రామాయణం, భారతం, భాగవతం. భారతీయులకు ఈ గ్రంథాలు వేదాల తరువాత వేదాల వంటివి. రామాయణం మహా కావ్యం, భారతం మహేతిహాసం, భాగవతం మహాపురాణం, రామాయణంను వాల్మీకి మహర్షి రాయగా, భారత, భాగవతాలను వ్యాసుడు రాశాడు. అందులో, భాగవతంను తెలుసుకొనుటకు భక్తి ఉండవలెను. భారతం తెలుసుకొనుటకు భక్తి, యుక్తి ఉండవలెను. రామాయణం గ్రహించుటకు భక్తి, యుక్తులు రెండే కాదు శక్తి కూడా ఉండవలెను. ఈ లక్షణాలు పుట్టుకతోనే అందరిలో ఉండుట అసాధ్యం. రామాయణం విశ్వజనీనమైన మహా కావ్యం ఎలా అవుతుంది? దీని తాత్పర్యం, భక్తితో రామాయణం చదివిన వారికి విన్నవారికి శక్తి, యుక్తులు క్రమంగా సిద్ధించును. భక్తి భగవంతుని యందు పరమ ప్రేమ రూపం. యుక్తి అనగా ఆలోచన; శక్తి అనగా నిపుణత ఈ మూడూ ఎవరిలో ఉంటాయో వారికి ఆనందరసం సంప్రాప్తమౌతుంది. కావ్యం రస ప్రధానం. రామాయణంలోని ముఖ్య రసం కరుణ. శృంగార వీరాదులు ఆనుషంగికాలైన రసాలు. సీతారాములు నాయికా, నాయకులు. ప్రతి నాయకుడు రావణుడు. ఈ గ్రంథంలో ఏడు కాండలు: బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర కాండలు. అయిదు వందల సర్గలు, 24,000 శ్లోకములు, సప్త సంఖ్యలో విశేషమున్నది. దశావతారాలలో రామావతారం ఏడవది. లంకలో యుధ్ధం జరిగిన రోజులు ఏడు, రాముని జన్మతార పునర్వసు, 27 సక్షత్రాల లెక్కలో ఏడవది.