RANGANTE ISTAM SAHITHI CHINTANALU by DR.CHAGANTI TULASI Telugu book cover

RANGANTE ISTAM SAHITHI CHINTANALU

by DR.CHAGANTI TULASI

₹200
In stock · 16 available
PublisherVANGURI FOUNDATION OF AMERICA
LanguageTelugu
చాగంటి తులసి సాహితీవేత్త, అభ్యుదయ రచయిత్రి, కథకురాలు, అనువాదకురాలు, మంచి వక్తగా ప్రసిద్ధి చెందిన వీరు విజయనగరంలో జన్మించారు. హిందీ సాహిత్యంలో డాక్టరేటు పొంది ఒడిశా ప్రభుత్వ ఎడ్యుకేషనల్ సర్వీసులో మూడు దశాబ్దాలు పనిచేసి ఒడియా తెలుగు భాషాసంస్కృతుల సేతువుగా పేరుప్రఖ్యాతులు పొందారు. 92-94లో I.C.C.R. ఢిల్లీ పంపగా హాంకుక్ యూనివర్సిటీ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ స్టడీస్, సియోల్ (దక్షిణ కొరియా) లో అతిథి ప్రొఫెసరుగా సేవలందించి భాషాసాంస్కృతుల వ్యాప్తికి దోహదపడ్డారు. ఇంపుగా ఎరుక పెంచుతూ ఆలోచింపచేస్తూ పనివాడితనంతో గుండెకు పట్టేకథలు రాసి 1991లో తెలుగువిశ్వవిద్యాలయంవారి సర్వోత్తమ కథారచయిత్రిగా సాహిత్యలోకంలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. హిందీ, ఒడియా, ఇంగ్లీషు భాషల నుండి వీరు చేసిన అనువాదాలు తెలుగు మౌలిక రచనలకు దీటుగా ఉంటాయన్నఖ్యాతిని పొందారు. కథలన్నా కథాప్రక్రియన్నా ఎక్కువ మక్కువ అయినా ఇతర ప్రక్రియల్లోనూ వీరి కృషి చెప్పుకోదగినదే. మౌలిక రచనలు, అనువాదాలు కాక సంపాదకురాలుగా, సంకలనాల కూర్పుకర్తగా తెలుగు, హిందీ, ఒడియా భాషల్లో పుస్తకాలు- తులసి కథలు, కొరియన్ జానపద కథలు, ఒడిశా జానపద కళలు, సచ్చిరావున్రాయ్ కథలు, మహాదేవివర్మ గీతాలు, ఓల్గా నుంచి గంగకు, అరొణ్యా విజయీ, సీతా రామకీ క్యా లగతీ హైఁ, రాగమాలిక, యాత్ర, హల్లాబోల్, చాసో కథలు – సాంస్కృతిక పదకోశం, నీ ఉత్తరం అందింది (చాసో మిత్రుల ఉత్తరాలు), ఆలోకన (చాసో వ్యాసాలు) ఇత్యాదులను వెలువరించారు. సాహిత్య అకాడెమి, ఢిల్లీ తెలుగు సలహా సమితి సభ్యురాలిగా వ్యవహరించారు. 1995లో చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్టును ఏర్పరచి కథారచనారంగంలో వారి స్ఫూర్తిని ప్రసరింపచేస్తూ చరిత్రను సృష్టించారు. 2004లో ప్రప్రథమంగా చాసో కథల సీడీని 'వాయిస్ ఆఫ్ చాసో'గా వెలువరించి రచయిత గొంతుకతో ఆడియో కథలకు దీపధారి అయ్యారు. చాసో సాహితీ వేదిక పేరున తనవంతు ఆర్థికసాయంతో విజయనగరం గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయం పైన ఎ.సి. హాలు నిర్మాణానికి తోడ్పడి ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ఇదిగో, ఇప్పుడు ఈ ప్రగతిశీల పసిడిపలుకులు! - అందుకోండి.. గండేషన్ ఆఫ్ అమెరికా ISBN: 1-892408-72-4