RANGU RANGULA SURYODAYAM by NIJAM PRACHURANALU Telugu book cover

RANGU RANGULA SURYODAYAM

by NIJAM PRACHURANALU

₹125
In stock · 5 available
PublisherP MOHAN
LanguageTelugu
వాక్యం జనాత్మకం కావ్యం లోకాన్ని, ప్రకృతిని చెరో చేతిలో పట్టుకొని చూసినప్పుడు మనోఫలకం మీద మెరుపు తీగల్లా ప్రతిఫలించిన దృశ్యాలు. నాలుగైదు వాక్యాల జీవన వాస్తవాల సెలయేళ్ళు... రంగు రంగుల సూర్యోదయాలు. వాక్యం క్షణ కాలం చిందులేస్తుంది. చిట్టిపొట్టి కుందేళ్ళలా, లేడి పిల్లల్లా గంతులేస్తుంది. జింగిల్ మాదిరిగా జిగేల్ మంటుంది. జివ్వుమనిపిస్తుంది. అక్షరాల ఊట బావి నుంచి తీసిన చేద నీరులా చవులూరిస్తుంది. సీతాకోక చిలుకలు రంగులద్దుకొనే చోట మౌనంగా ప్రతిధ్వనించే రెక్కల చప్పుళ్ళ గుసగుసలాట. మనిషి విషాదయానంలో విరామ సంగీతాన్ని వినిపించే అరుదైన పదాల పాద విన్యాసాలు. కాచి వడపోసిన తర్వాత వచ్చే చిక్కదనం లాంటి సుందర మందార మాల. చదువరులను వరించే కలల కన్నెల మధుర భాషణల, ఫలించని స్వప్నాల విషాద పుటలు. మినీ, మ్యాక్సీ అని గౌనులు తొడిగి కవిత్వాన్ని అవమానపరిచారు. తాము ఆజానుబాహులమని భావించి అనల్పార్థాల అల్ప నిర్మాణాలను తమ మోకాళ్ళ వద్ద వుంచి హేళన చేశారు. వాక్యం రసాత్మకమే కాదు జనాత్మకం కూడా కావ్యమే. దానికి కొలత, కొలమానాలు లేవు. చల్లని తీపి తెమ్మెర, హాయి గొలిపే బాల గాలి ముందు వడగాడ్పుల్లాంటి పెను గాలులెందుకు? ఇటీవలి గతంలో నివురు', నాలుగోపాదం', అలలు', బూడిద చెట్ల పూలు', ఇప్పుడు అందంగా చెక్కిన ఈ నల్లరాతి బొమ్మల కొలువు. అక్కడక్కడైనా ఎండిన ఎదలకు మానవత్వ కవిత్వ తేమ అద్దె అపురూపాలు. రెప్పపాటులో విప్పారిన లిల్లీ పూల వనం. అప్రయత్నంగా విరిసిన కవితా కుసుమాలు. అక్షర మార్దవం, భావగాఢత, విస్తృతి పెనవేసుకొన్నకవన సీమ నిజం సృజన.