
RANGULA CHEEKATI
₹100
In stock · 51 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Rangula cheekati Collection of stories by Chandrasekhar Indla కాని నాకా రంగులు కావాలి, చీకట్లో స్పష్టంగా కనపడే రంగులు కావాలి. ఆ రంగులను వెతికే క్రమంలో పండువెన్నెల లాంటి నా కొడుకు అందాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. మంచు ముద్దలాంటి నా భార్య ప్రేమని పంచుకోలేకపోతున్నాను. నాకు కావాల్సింది చీకట్లో కనపడే ఆ రంగులు. ఆ రంగుల లోకం . అందుకే వెలుగు మీద కోపాన్ని చీకటి మీద ప్రేమని పెంచుకున్నాను. నాకిప్పుడు చీకటి పతివ్రత లాగా, వెలుగు వేశ్యలా కనిపిస్తుంది. రంగుల చీకటి "నీకు సిగ్గెట్టలేదమ్మే మళ్ళీ ఈ వూరి జనాలమద్దికి రాడానికి సెడిపోయిన్దానా యాక్ థు" అని సుభాషిణి ముఖంమీదూసింది మా అమ్మమ్మ. అది సుభాషిణి కంటి మీద పడి కిందక్కారతంది. " అప్పో నేనేం ఇక్కడున్దామని రాలేదులేయే, పోతానెయ్, ఆ నా బట్ట పదిరోజులనంగా యాడికోబోయేడు ఆడినెతుక్కుంటా ఇటొచ్చా..... ఆడు రాంగాల్లోనే ఈ పిల్లనిడిసిపెడతానే... ఆడు నన్నెతుక్కుంటా కచ్చితంగా వత్తాడెయ్..." అని పెద్దగా అరుస్తుంది సుభాషిణి -సుభాషిణి కాదు సుమలత "ఎవుడు మామ వోడు మన మోమ్సం తినకూడదని రూలు పెట్టేదే నాయల్ని రమ్మను ఈడికే, దున్నని కోసే కత్తితో కొయ్యక పోతే అప్పుడడుగు" అన్నాడు వీర కోపంగా. "నీ దగ్గర దున్నని కోసే కత్తే వుందిరా నాయాల వొళ్ళ దగ్గర తుపాకులు వున్నాయ్" అంటా పైకి లేగిచి పేపరు తీసుకొని ఇంటికి వెళ్ళబోయాడు మా సిన్నాయన. -బోరచెక్కు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004