RANGULA VALA-60 by ADELLA SIVAKUMAR Telugu book cover

RANGULA VALA-60

by ADELLA SIVAKUMAR

₹60
In stock · 2 available
PublisherADELLA SIVAKUMAR
LanguageTelugu
బ్రహ్మండమైన స్టేజ్... విద్యుద్దీపాలతో ధగధగమంటూ మెరిసిపోతున్నది.... ఫంక్షన్... ప్రపంచ సిన్మాకు సంబంధించి అద్భుతమైన సంరంభం... ఆస్కార్ అవార్డ్స్ కోట్లాదిమంది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు కూర్చుని లైవ్ టెలీకాస్ట్ తన్మయంగాచూస్తున్నారు... ఆకాశం నుంచి క్రిందకు దిగి వచ్చిన నక్షత్రాల్లా మెరుస్తున్నారు హాలివుడ్ స్టార్స్... హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్స్ సిన్మా ప్రపంచం అంతా దాదాపుగా అక్కడే వుంది... ఆ వైభవం, గ్లామర్ చూసేందుకు రెండు కళ్ళూ చాలటం లేదు... బెస్ట్ హీరో, హీరోయిన్ అవార్డుల ప్రదానం అయిపోయింది... ప్రస్థుతం బెస్ట్ డైరక్టర్... ఎవరికి రాబోతుంది? వీక్షిస్తున్న అందరూ ఉత్కంఠతతో ఉపిరి బిగపట్టారు... స్టేజ్ మీద నుంచి షరాన్స్టీన్ హాలీవుడ్ డైరక్టర్ స్పీల్బర్ను ఆహ్వానించింది... "మిస్టర్ స్పీల్బర్గ్ ఈసారి ఆస్కార్ బెస్ట్ డైరక్టర్ ఎవరో డిక్లేర్ చేస్తారు..." అంటూ ఎనౌన్స్ చేసింది... స్పీల్బర్గ్ స్టేజ్ మీదకు వచ్చి అందరికీ చేయి వూపాడు.... చిరునవ్వుతో ఓ నిమిషం సేపు మాట్లాడిన తర్వాత ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ పేరు ఎనౌన్స్ చేశాడు... "మిస్టర్ శంకర్ ఫ్రమ్ ఇండియా... బాపట్ల ఆఫ్ గుంటూరు జిల్లా...." ఆకాశం దద్దరిల్లిపోయేలా చప్పట్లు మారుమ్రోగాయి... శంకర్ తను కూర్చున్న ఛెయిర్లోంచి పైకి లేచాడు... పక్కనే కూర్చుని వున్న ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ షేకండ్ ఇచ్చాడు.... హూందాగా నడిచి స్టేజ్ ఎక్కాడు... కెమెరా ఫ్లాష్లు తళతళమంటూ మెరుస్తున్నాయి... వందలాది వీడియో, మూవీ కెమెరాలు ఆ దృశ్యాన్నంతా చిత్రీకరిస్తున్నాయి.... ఆహూతులు ఆపకుండా కరతాళ ధ్వనులు చేస్తూనే వున్నారు...