RANI RUDRAMADEVI CHARITRATHMAKA NAVALA by THALLAPALLI YADAGIRI GOWD Telugu book cover

RANI RUDRAMADEVI CHARITRATHMAKA NAVALA

by THALLAPALLI YADAGIRI GOWD

₹125
In stock · 6 available
PublisherTHALLAPALLI YADAGIRI GOWD
LanguageTelugu
ఒక జాతి మూలాల చిరునామా, గుర్తింపు ఆజాతి చరిత్ర నుండి తెలుస్తాయి. అందుకే ఎవరికివారు తమగతాన్ని (అది కుటుంబంకావచ్చు, సమాజం, ప్రదేశం లేదా జాతి కావచ్చు, సమాజం, ప్రదేశం లేదా జాతికావచ్చు) గురించి, నాగరికతా పరిణామ క్రమంలో, సాంస్కృతిక నేపథ్యంలో అది ఎలాంటి పాత్రను నిర్వహించిందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అక్కడి నుండి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని సంతృప్తిగా పొందాలని ఆశపడతారు. ఆవెలుగులో ధృఢమైన ముందడుగు వేయగల్గుతారు. చరిత్ర గుణపాఠాలు ఒకే రకంగా ఉండవు. ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం లేదా ఒక సమాజపు స్థానికచరిత్ర ఆయావ్యక్తుల్ని రకరకాలుగా ఉత్తేజితుల్ని చేస్తుంది. ఉదాహరణకు- ఆవ్యక్తి కుటుంబం గొప్ప సాంస్కృతిక నేపథ్యం కలదైతే దాన్ని కొనసాగించడం తన బాధ్యత అని శ్రమించటం, లేదా అది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో వెనుక బడి ఉంటే దాని ఉద్దీపనకు కృషి చేసి ముందు తరాలవారికి స్ఫూర్తి దాయకంగా నిలపడం జరుగుతుంది. అది సజ్జన లక్షణం. స్థూలంగా తెలుగునాటికి, ప్రత్యేకంగా ఓరుగల్లుకు ఒక ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. దాన్ని స్ఫూర్తిదాయకంగా గ్రహించాలంటే ఆ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం అందరికీ సుస్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ పని చరిత్రకారులు, విజ్ఞులు అయిన మేధావులు చెయ్యాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకరచన. శ్రీ యాదగిరిగౌడ్ గారికి జర్నలిస్టుగా విశేషమైన అనుభవం ఉంది. చరిత్ర పట్ల మక్కువ ఉంది. అందుకే చారిత్రకాంశాన్ని తీసుకుని ఒక కళాకృతిగా మన కందించే ప్రయత్నం చేశారు. “చరిత్ర సత్యపుకాగడా” చరిత్ర ఒకశాస్త్రం అనే మాటకు తిరుగులేదు. అని కొందరంటే “చరిత్ర ఒక కళ, అయితే అదివాస్తవంపై ఆధారపడిన ఉత్సుకతను రేకెత్తించే శైలిలో ఉండేరచన" అని మరికొందరన్నారు. ఏది ఏమైనా చరిత్రవిషయానికి వస్తే, అది మంచైనా, చెడైనా వాస్తవఘటనను తెలుసుకోవాలనే కుతూహలమే ఎక్కువ మందిలో ఉంటుంది.