RASAYANA MULAKALA RAHASYALU by CHATTI SRINIVASA RAO Telugu book cover

RASAYANA MULAKALA RAHASYALU

by CHATTI SRINIVASA RAO

₹250
In stock · 218 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
RASAAYANA MULAKAALA RAHASYAALU Translated by: Chatti Srinivasa Rao పుస్తకంలో ఏముంది? మీకొక విషయం తెలుసా? మన భూమి మీద నేల, సముద్రాలు, నదులు, కొండలు, అడవులు, ఎడారులు, మనుషులు, జంతువులు, చెట్లు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటికి తోడు మనం సృష్టించిన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో నగరాలూ, ఊర్లు, రోడ్లు, భవనాలు, విమానాలు, కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. మన భూగోళం, దాని మీద మనిషి సృష్టించిన ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఉన్నాయో లెక్క వేస్తే అవి లక్షలలో ఉంటాయి. కానీ ఆ లక్షలలో ఉన్నవన్నీ, అన్నీ అంటే సమస్తమూ తయారుచేయడానికి సుమారు 120 మూలకాలు మాత్రమే అవసరం అనే విషయం మీకు తెలుసా? రసాయనశాస్త్రం ఈ విషయాన్ని కనుగొంది. ఉదజనితో ప్రారంభమై హీలియం, లిథియం, బెరిలియం ఇత్యాది మూలకాలే ఆ 120. అంతేకాదు చరాచర జగత్తు - అంటే మన సూర్యుడు, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీలు మొత్తం సమస్త జగత్తూ కూడా నూట ఇరవై మూలకాలతోనే తయారైందని అనుకోవచ్చా? సమాధానం ఈ పుస్తకం చదివి తెలుసుకోండి! ఇకపోతే రష్యన్ రసాయన శాస్త్రవేత్త మెందేలేయేవ్ ఆవిష్కరించిన మూలకాల ఆవర్తన పట్టికలో పైన చెప్పిన సుమారు 120 మూలకాలు ఏ విధంగా అమర్చాలో ఆ అమరిక వెనుక నున్న లాజిక్ ఏమిటో పుస్తకం మీకు చెపుతుంది. ఐస్క్రీం తినడమంటే చాలా మందికి ఎందుకు ఇష్టం? ఇనుప వస్తువులు తుప్పు ఎందుకు పడతాయి? అసలు తుప్పు అంటే ఏమిటి? అతి సాధారణమైన బొగ్గు (అంటే కార్బను), అతి విలువైన వజ్రం రెండు కార్బను రూపాలే అని మీకు తెలుసా? బొగ్గునే వజ్రంగా మార్చవచ్చు అని తెలుసా? ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రక్రియ సాధ్యం? విద్యుత్తుని రసాయన చర్యవల్ల పుట్టించవచ్చని తెలుసా? విద్యుత్ ఘటం ఎలా తయారు చేయాలి? ప్లాస్టిక్కులు ఎటువంటి మూలకాలతో తయారు చేస్తారు? సూర్యగోళంలో జరుగుతున్న రసాయన చర్య ఏమిటి? ఇటువంటి చాలా చాలా ప్రశ్నలకి సమాధానాల కోసం ఈ పుస్తకం చదవండి. రసాయనశాస్త్రంలో రీసెర్చ్ చేస్తున్న వారికి కొత్తగా కనిపెట్టడానికి ఏమున్నాయి? చాలా ప్రశ్నలకి శాస్త్రం ఇంకా సమాధానం చెప్పలేదు. అవి ఏమిటి? పుస్తకంలో చదవండి. మీరే ఆ ప్రశ్నలకి జవాబు కనుగొంటారేమో!! రసాయనశాస్త్రం అతి తేలిక తెలుగులో, ఎటువంటి క్లిష్టమైన ఈక్వేషన్స్ లేకుండా, సరదాగా చదవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004