RATHNAKAVI ANUVADA LAHARI by AMBATIPUDI VENKATARATNAM Telugu book cover

RATHNAKAVI ANUVADA LAHARI

by AMBATIPUDI VENKATARATNAM

₹250
In stock · 38 available
PublisherAMBATIPUDI VENKATARATNAM
LanguageTelugu
ముందుమాట ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వెల్లువలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు దారీ తెన్నూ తెలియక కొట్టుమిట్టాడుతున్న సందర్భం ఇది. ప్రపంచం కుగ్రామంగా మారిందని కొందరు సంతోషపడుతున్నారేగానీ తన అస్తిత్వం అగమ్యగోచరంగా మారుతోందని తెలుసుకోలేక పోతున్నారు. చాలాదేశాల ప్రజలు తమ జాతి ప్రత్యేకత, తమ సంస్కృతి, నాగరికత, ఆచారవ్యవహారాలు, జీవనవిధానం, పండుగలు ఇవన్నీ మర్చిపోయి భిన్నత్వానికి దూరంగా ఏకరూప జీవితాన్ని గడుపుతూ అక్కడ తమ మూలాలు లేవు కాబట్టి సంతృప్తి పొందలేక ఏం కావాలో తెలియక, ఏం పోగొట్టుకున్నామో తెలియక అశాంతిమయ జీవితాన్ని గడుపుతున్నారు. భారతదేశం ఈ స్థితికి అతీతంగా ఏమీ లేదు. భౌతిక సుఖాలు మాత్రమే ఆనందాన్ని ఇవ్వలేవని వాటివెంట పరుగులు పెట్టీ పెట్టీ అలసిపోయిన ప్రజలు గుర్తించారు, గుర్తిస్తున్నారు. పరిగెత్తి పాలుతాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదని తెలుసుకుంటున్నారు. తమ జాతి సంస్కృతి, ఆచారం, వ్యవహారాలు పాటించకపోవడంతో ఎంతో ఆనందం ఉందని గ్రహిస్తున్నారు. తమ దేశం అందించి వెళ్లిన పురాణేతిహాసాలు, కావ్యప్రబంధాది అనేక విషయాలున్నాయనే తెలివిడి కలుగుతోంది. ఈ సందర్భంలో భారతీయ సాహిత్యంలోని అనేక గ్రంథాలను నేటి చదువరుల అవసరాలకు అనుగుణంగా ప్రచురించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. దాంట్లో భాగమే ఈ 'రత్నకవి అనువాదలహరి'. అడిగినదే తడవుగా 'అనువాద వంశీరవం' అనే పేరుతో శ్రీరాళ్లబండి కవితాప్రసాద్ గారు తమ అమూల్యమైన అభిప్రాయం వ్రాసి ఇచ్చినందులకు మా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. 2013 డిశంబరులో మేము 'కవిరత్న' అంబటిపూడి వెంకటరత్నం గారి "షడ్దర్శనములు" అనే గ్రంధాన్ని ప్రచురించాం.