RATRI PAGALU OKA MELUKUVA by KARRA YELLAREDDY Telugu book cover

RATRI PAGALU OKA MELUKUVA

by KARRA YELLAREDDY

₹85
In stock · 11 available
PublisherKARRA YELLAREDDY
LanguageTelugu
కుంపటి బెల్ అయినట్టుంది. ప్రార్ధన కోసం పిల్లలు ఉరుకుతున్నరు. లొల్లి తగ్గింది. లొల్లి చేయకుంటె పిల్లలు అందంగ ఉంటరు. చిన్న పిల్లల కండ్లు ఎంత ముద్దుగ ఉంటయో! జీడిగింజలోలె నల్లగుడ్లు, చూస్తుంటే మనసు నిండింది. చేపకండ్లు, నీలాలకండ్లు, అన్నింటికీ మించి అమాయకంగా ఉన్న ఆ కండ్లను చూస్తున్న నా చెవుల “మా తెలుగుతల్లికి మల్లెపూదండ" మోగింది. ప్రార్ధన అయింది. ఎవల క్లాసుకు వాళ్ళు పోయిండ్రు. తెల్లారితే దసరా సెలవులు, బడిల హాజరు పలచగ ఉంది. వచ్చిన పిల్లగాండ్లల్ల సెలవుల సంబురం. చిన్నా, పెద్ద పండుగ గురించే మాట్లాడుకుంటున్నరు. అంతటా పండుగ వాతావరణం. ఊరికి పోవాలని మా పిల్లల ఆలోచన. బట్టల కోసం ఆమె, డబ్బుల కోసం నేను, ఒప్పందాలు కుదిరినయి. ఊరికి పోవుడు ఖాయం అయింది. పంటలు లేక కాపుదనపోల్లు, లాభాల్లేక కోమటోల్లు, ఏమీలేక మామూలు జనం పండుగకు తయారయిండ్రు. ఎవరికి ఏమున్నా లేకున్నా అందరికి బతుకమ్మ ఉంది. దసరా ఉంది. పెత్రమాస నుంచి బతుకమ్మ పండుగ వరకు మధ్యల అర్రెం తప్ప వరుసగ సాయంత్రాలు ఆడోల్లు ఆడుకునే ఆట బతుకమ్మ. ఊరికి రాక చాన రోజులైంది. వచ్చినపుడు అందర్ని కలువాలని బయటపడ్డ. “అంత మంచిదేనా” ఎదురుగ రాజిరెడ్డి “నమస్తే మామ, బాగేనా” “అంత బీరిపోయి నడుత్తున్నవేంది” “బాల్రెడ్డి ఉన్నడా” "వాడెటు వోతడు. పా...” ఇంటికి తీస్కపోయిండు. పెద్ద బంగ్లా. కులం ఒకటి కాకున్నా చిన్నప్పటి నుంచి మామ వరుసతో పిలిచెటోన్ని బాల్రెడ్డి ఈయన కొడుకు. నాకంటే చిన్న. బంగ్లా అరుగుదాటి లోపలికి పోయినం. బిజీగా బాల్రెడ్డి.