
RAVI KONDALARAO KATHALU
₹65
In stock · 144 available
PublisherRK BOOKS
LanguageTelugu
రామ్మూర్తి పెళ్లయింది బస్సుకోసం పడిగాపులు కాస్తూ ఫర్లాంగున్నర పై చిలుకున నించున్న క్యూలో చిట్టచివర వచ్చి చేరిన వసంత, కొంతసేపటికి మధ్యకొచ్చి - వెనక్కు తిరిగి చూసుకుని "పూర్వకాలం'' నాటి తన స్థానాన్ని తలచుకుని, తను ఎంత ముందు కొచ్చిందో వూహించుకుని, "ఓయబ్బో' అని నిట్టూర్చి ముందు నడక సాగించింది. ఈలోపల వచ్చే బస్సులు వస్తున్నాయి - అట్లాగే పోతున్నాయి. ఎక్కుతున్న వాళ్లు ఎక్కుతున్నారు - మిగతావాళ్లు క్యూలోపడి కొట్టుకుంటున్నారు. వసంత వెనక్కు తిరిగి చూసుకోవటంలో, ఆరు శాల్తీలకు వెనకవున్న తాజా యువకరత్నం ఒకడు, తనకోసమే కాబోలు ఆ చూపు అనుకుని, మృదువుగా కాలరు నిమురుకున్నాడు. క్యూలోని జనాభాలో కొందరు అక్కడే కూలబడుతున్నారు. మరికొందరు కాళ్ళు నొక్కుకుంటున్నారు. ఒకాయన ఆ క్యూలో నించునే, శరత్బాబు పెద్ద నవల పూర్తిచేసి, పుస్తకం మడిచి, మరో పుస్తకం వుంటే బాగుండును అని తలపోశాడు. ఒకడు, లెక్కవేసుకున్న ప్రకారం ఇరవై నాలుగు సిగరెట్లు కాల్చాడుట. కొందరు స్టూడెంట్లు క్యూలో నడుస్తూనే పాఠాలు కంఠతా పడుతున్నారు. వసంత ఇవేమీ చెయ్యకుండా అటూ ఇటూ వున్న పరిసరాలను మాత్రం చూడసాగింది. “ఈ పక్క మేడ ఎంతసేపని చూడను?" అని విసుక్కున్నది కూడా. ఆమెకు ఆరుగురి వెనక వున్న ఆ యౌవనుడు, ఆమె వెనక్కు వచ్చి చేరాలని మహ ఉవ్విళ్ళూరిపోతున్నాడు. బస్సుల రాకడా, అసువుల పోకడా తెలియవని పెద్దలంటారు. అందువల్ల పెద్దల వాక్కును జవదాటని ఇంకో బస్సు - ఎట్టకేలకు తెలియకుండా, ఛట్టున వచ్చి నించుంది. సాగుతున్న చీమలబారు దగ్గర, కాస్త వూదితే, బారు చెదిరి అటూ ఇటూ పోయినట్టుగా - బస్సు ఆగగానే ఈ "బారు” కూడా చిందరవందరై తోపులాటలూ, అడావుడులతో బస్సు ద్వారం ముందు ముద్దగా మూగింది. ఆ ముద్దంతా మగ ముద్ద. ముగ్ధలంతా వెనక్కు వుండిపోయారు. ఒకడినో, అరనో సేకరించుకుని -మిగతావాళ్ళను వాళ్ళ ఖర్మకు వదిలి- మంత్రిగారి బావమరదల్లే పోజిచ్చి - బస్సు -