RAVI KONDALARAO NATAKALU by RAVI KONDALA RAO Telugu book cover

RAVI KONDALARAO NATAKALU

by RAVI KONDALA RAO

₹99
In stock · 230 available
PublisherRK BOOKS
LanguageTelugu
ప్రొఫెసర్ పరబ్రహ్మం మొదటి రంగం (ప్రొఫెసర్ పరబ్రహ్మం ఇల్లు ఎదురుగా ఒక గుమ్మం లోపలకు పోయేది కనిపిస్తుంటుంది. రెండు మూడు కుర్చీలు, టీపాయి, ఒక పక్కవుంటాయి. ఎడమవేపు (ప్రేక్షకులకు కనిపించేలా) లాబొరెటరీ, సామగ్రి అంతా కన్పిస్తుంటుంది. తెర లేచేసరికి అంతా చీకటిగా వుంటుంది. లాబొరేటరీ టేబిలు పైనవున్న ఎర్రదీపం మాత్రం వెలుగుతూ వుంటుంది. టేబిల్ వెనుక వున్న పరబ్రహ్మం టెస్ట్యూబ్లో ఏదోవేస్తాడు. ఒక శబ్దం, పొగ వస్తాయి. వెంటనే పరబ్రహ్మం టేబిలు వెనుక నుంచి పైకి లేస్తాడు. “సాధించాం- సాధించాం' ' అంటూ పెద్దగా కేకలేస్తూ వుత్సాహంగా స్టేజిమీద తిరుగుతూ వుంటాడు. స్టేజి మీద 'స్పాట్లెట్' వెలుగుతుంది) పర : (గట్టిగా పిలుస్తూ ఆనందంగా) లోకాభిరామం లోకాభిరామం -లోకాభిరామం! లోకా : (లోపల్నుంచి పరుగెత్తుకు వచ్చి) సార్! ఏమిటిసార్! ఏమిటి సార్? పర : దొరికిందయ్యా దొరికింది! కీలకం దొరికింది. నా ఇరవై ఏళ్ళ శ్రమ ఫలించింది! మనిషిలో తగ్గిపోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాగల అత్యద్భుతమైన దివ్య ఔషధం లభించింది. లోకా : అమ్మ - లభించిందా! మీ కష్టంతోపాటే నాకష్టం కూడా ఫలించిందన్నమాట. మీకు అసిస్టెంట్గా పనిచెయ్యడం నిజంగా నా అదృష్టం సార్! జై ప్రొఫెసర్ పరబ్రహ్మం గారికీ! ప॥గొ. : జై (అని పలు గొంతులు వినిపిస్తాయి) లోకా : అతని అసిస్టెంట్ లోకాభిరామానికీ! ప॥గొ. : జై లోకా : సార్! ఇక మీకు ప్రపంచం మంగళ హారతి పడుతుంది. విజ్ఞాన శాస్త్రం మీ మేధా శక్తికి జోహార్లు అర్పిస్తుంది. ప్రభుత్వం మీకు బిరుదులు ప్రసాదిస్తుందిసార్! : అవును. ఇక నాకు ఊరూరా ఘనసన్మానాలు ఊరేగింపులు, సభలు, సమావేశాలు... (మంగళవాద్యాలు - మంత్రాలు వినిపిస్తాయి) (అంతలో ఒక గొంతు వినిపిస్తుంది) పర గొంతు : ప్రొఫెసర్ పరబ్రహ్మంగారంటే నిజంగా పరబ్రహ్మ స్వరూపం. మనిషిని సృష్టించిన భగవంతుని తెలివితేటలు మించిన తెలివి తేటలు పరబ్రహ్మం గారివి.