
RAVINDRA BHARATI SANGHIKA NAVALIKA
by AYYADEVARA PURUSHOTTHAMARAO
₹30
In stock · 16 available
PublisherAYYADEVARA PURUSHOTTHAMARAO
LanguageTelugu
ముందుమాట బసవరాజు నరసింహారావు బాల్యమిత్రుడు -ఆప్తుడు- పురుషోత్తమరావునన్ను తన నవలకు ముందుమాట వ్రాయమనినప్పుడు- ఆతడు వ్రాసిన నవలకు 'ముందుమాట' వ్రాయదగినంత ఔన్నత్యం, పాండిత్యం నా దగ్గరెక్కడుంది? అని తటపటాయిస్తుండగా- 'ఈ నవల 'రవీంద్రభారతి'ని స్వర్గీయ గోపాలరావుగారికి అంకితమిద్దామని వ్రాశానోయ్' అన్నాడు - తనే - మళ్ళీ. నవల వ్రాసినవాడు మిత్రుడు గోపాలరావుగారు ఆత్మీయ మిత్రుడు నాకు, ఆధ్యాత్మిక సారధి వారధి వంటివాడు. ఇద్దరూ ఇంత ఆత్మీయులైనందున నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయాలనిపించింది. ముందుగా గోపాలరావుగారిని గురించి రెండు మాటలు వ్రాసి, తరువాత 'రవీంద్రభారతి' వద్దకు వస్తాను. భగవంతుడనే వాడు ఒకడున్నాడు అని విశ్వశించే వ్యక్తులలో నేనొకడిని. పేరు భగవంతుడని పెట్టినా, లేక మరొక మహాశక్తి రూపమైనా ఏదో మహత్తరశక్తి మనలను నిడిపంచు చున్నదనీ, అది కనులకు కనుపించక పోయినా దాని ప్రభావము మనపై, మనప్రమేయము లేకుండానే దానికి మనలను దాసులుగా చేసుకుంటుందన్న నమ్మకమూ నాకు వున్నది. అట్టి ప్రకృతి ప్రభావకారణముననే కావచ్చు, నాకు గోపాలరావుగారి వంటి ఉన్నత వ్యక్తితో పరిచయము ఏర్పడటం. దీనిని నేను ఇప్పుడూ ఎప్పుడూ అమూల్య సంపదగానే భావిస్తాను. 'నీకు గోపాలరావుగారితో ఎప్పుడు, ఏ విధంగా పరిచయమైనది" అని ఎవరైనా ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానమే లేదు. ఈ పరిచయానికి ముందు ఎన్నెన్ని ఘటనలూ, సంఘటనలూ, ఈ విధముగా మా కలయికకు తోడ్పడినవో ఎవరెరుగుదురు? నేను పైన చెప్పిన ఆ భగవంతుడు తప్ప! ఇంతకూ ఆయన పరిచయమాత్రమున నాకు జరిగిన మేలు ఎట్టిది? ఎంతటిది? అని ప్రశ్నిస్తే, అది కొలమానమునకు సరిపడునది కాదు. అయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎక్కడలేని ఆనందము ఉత్సాహము! అది నా అదృష్టమో, లేక ఆయనతో పరిచయము కలిగిన వారందరి అనుభవమో!