RAVINDRA GEETHA GITANJALI by NAGARAJU RAMASWAMY Telugu book cover

RAVINDRA GEETHA GITANJALI

by NAGARAJU RAMASWAMY

₹100
In stock · 5 available
PublisherTHIRURANGA PRACHURANA
LanguageTelugu
మరల నిదేలయన్న.. డాక్టర్ లంకా శివరామ ప్రసాద్ Thou hast made me endless such is the pleasure this frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life (Tagore) ప్రభూ! అనంతుణ్ని చేసావు నన్ను అదీ నీ ఆనందం-మరల మరల ఈ ఓటికుండను ఒలకబోస్తూ మళ్లీ మళ్లీ సరికొత్త జీవనంతో నింపుతూ- (నాగరాజు రామస్వామి) నిదురించే పసిపాప వదనం పై క్షణకాలమాత్రం మెరిసి మాయమైపోయే ఆ ముగ్ధమనోహరమైన చిరునవ్వు....... ఎక్కడి నుంచి వచ్చినదో? అదృశ్యమవుతున్న శరత్కాలపు మేఘమును నెలవంక వెన్నెల తాకినదేమో మంచుతడిసిన ఉదయపు స్వప్నంలో! ఏమో! ఈ అతిలోక భావుకత, అనంత సౌందర్య పిపాస, సృష్టికర్తను అల్లుకున్న అపురూప ప్రేమ, ఉపనిషత్ స్పర్శ, భారతదేశీయ మూల సంస్కృతి, విశ్వజనీన ప్రేమ, శాంతికొరకు పరితపించే మానసిక ప్రవృత్తి, మానవత్వంపై వల్లమాలిన నమ్మకం, అతీంద్రియ దృష్టి- అన్నీ కలబోసిన అపురూప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ (రబీంద్రనాథ ఠాగూర్) (టాగోర్) W. B. yeats - Tagore was the product of a whole people, a whole civilization, immeasurably strange to and seems to have been taken up into this imagination and yet we are not moved because of its strangeness, but because we have met our own image,