RAVVALU by B.A.V.VARMA Telugu book cover

RAVVALU

by B.A.V.VARMA

₹100
In stock · 76 available
PublisherB.A.V.VARMA
LanguageTelugu
విజయనగరంకు చెందిన విధ్వాంసుడు శ్రీ బి.ఎ.వి.వర్మ ఉన్నతవిద్యావంతుడు. తల పండినవాడు. సమాజశ్రేయస్సేధ్యేయంగా కలిగిన సహృదయుడు. ఈయన రూపొందించిన లఘురూపకవితా ప్రక్రియ రవ్వలు. ఇందులో వాడిన భాష ప్రజాస్వామ్యభాష, భావం నూరుపాళ్ళూ ప్రజాహితం. ఇదిగొప్ప లక్ష్యంతో సాగిన ప్రక్రియ. ఈప్రక్రియలోని 4వ వాక్యం ప్రత్యేకంగా, ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించేదిగా, చీకటిలో కొవ్వొత్తిలా వుంటుంది. ఎమ్ కె సుగంబాబు. ప్రముఖ పైగంబరకవి, లఘురూపకవితావేదిక వ్యవస్థాపకఅధ్యక్షులు. వర్మగారు నాలుకమీదరుచిచూపించి, దాని రుచిఎలావుందో ఆలోచించమనేటట్లు కవిత్వాన్ని రాస్తున్నారు. ప్రతిరవ్వలోని వస్తుతత్వాన్ని ఎంతైనావ్యాఖ్యానించగలిగే శక్తి యీకవిత్వంలోవుంది. రవ్వలను లోతుగా పరిశీలిస్తే కవిలోగల సమసమాజ స్పూర్తి, పేదప్రజలపట్లగల ఆర్తి తెలుస్తుంది. ఇవి న్యాయంకోసంవెలిగిన రవ్వలనిమాత్రం చెప్పక తప్పదు. వర్మగారికవిత్వంలో అభ్యుదయభావాలు, ప్రయోగాలున్నాయి. కొత్తప్రయోగంతో ముందుకొచ్చిన కవి అభినంద నీయులు. ఆచార్య దార్లవెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు ఆధునిక తెలుగు కవితావనాన్ని పోషిస్తూ, కవితాకుసుమాలనుపూయిస్తూ, తనతర్వాతి తరంవారికి ఒకమోడల్ గానిలచే ప్రయత్నం చేస్తున్నవారు శ్రీ విశ్వేశ్వరవర్మ భూపతిరాజుగారు. ఈరవ్వలు కవితాసంపుటి వెలువరిస్తున్న “రవ్వలరేడు” భూపతిరాజుగారి ఈరవ్వలు సమాజంలోని అనేకాంశాలను స్పృసించాయి, ప్రశ్నించాయి, ఫలితం ఆపేక్షించాయి, మనిషిని నేర్చుకోమన్నాయి. సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న యీ రవ్వలు 'దివ్వెలు' కాక మరేమిటి? - ఆచార్య ఎన్.వి. కృష్ణారావు, నాగార్జున విశ్వవిద్యాలయం. గుంటూరు. సమాజాభివృద్ధిని కాంక్షిస్తూ, జనంమెచ్చేభాషలో, నచ్చేయాసలోరాస్తే తప్పక ఆదరిస్తారని గతం తెలియజేస్తుంది. అదేకోవలో వచ్చిన మరో ప్రక్రియ రవ్వలు. తనచుట్టూవున్న సమాజంయిచ్చిన అనుభవంలోంచి పొంగిన వాక్యాలు రవ్వలుగా మెరిసిపోతాయి. వర్మగారి కవిత్వం సాదారణమనిషిని కవిత్వ వస్తువుగాస్వీకరించింది. మానవీయతకు పట్టంకట్టింది. రవ్వలలో వ్యక్తీకరణలు వర్మను అసలు సిసలైన అభ్యుదయకవిగా నిలబెడతాయి. ఎన్. ఈశ్వరరెడ్డి, ఆచార్యులు, యోగివేమన విశ్వవిద్యాలయం, కడప, రాజుగారి సాహిత్యస్వర్ణోత్సవ సందర్భంగా వెలువడుతున్న కవితాసంపుటి రవ్వలు. కవులు పాతబాటల్లోపయనించకుండా, తమదైనమార్గాన్ని ఏర్పరుచుకొని ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వుంటారు. అటువంటివారిలో వర్మగారొకరు. ఈ రవ్వలు ఆలోచనాత్మకంగా, ఆవేదనాత్మకంగా, భావ స్పోరకంగా, సామాజిక ప్రతిబింబంగా, సందేశాత్మకంగా, వ్యక్తిత్వవికాస ప్రభోదకంగా వున్నాయి. - డా. గుమ్మా సాంబశివరావు. (విశ్రాంతి) తెలుగుశాఖాగ్రణి. ఆంధ్ర లయోలకళాశాల, విజయవాడ.