
REKKA VIPPINA RAAGAM
₹80
In stock · 3 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
నేస్తమా... ఇటురా ఆగస్టు పదిహేను పండుగ రాత్రి అందరికీ జాబిల్లి ఆశలవెన్నెల పంచుతూంది స్వాతంత్య్ర పోరాటం కానుకగా యిచ్చిన గాయాల్ని ఆచ్ఛాదన లేని నా శరీరం ఆరబెట్టుకుంటూంది చలికి చిగురాకులా వణుకుతూ వుంది భూమి బంగారు భవిత ఊహలతో వెలిగిపోతూంది ఆకాశం ఆశయాల రంగులద్దుకుంటూంది తల్లి భారతికి సంకెళ్ళు తెగిన చప్పుళ్ళు వణికే శరీరంపై స్వాతంత్య్రం వెచ్చటి దుప్పటి కప్పింది గాయాలు మచ్చల్లేని జ్ఞాపకాలయ్యాయి ఊహలు కళ్ళేలు లేని గుఱ్ఱాలయ్యాయి ఇక సమస్యలు క్షణంలో పరిష్కారం అందరికీ అందుబాటులో మృష్టాన్నం నేరాలు రాని కోర్టులు కునుకు తీస్తాయి కలలతో అలసిన ఊహలు విశ్రమించాయి ! మర్నాడు అభ్యర్థన దరఖాస్తు చేసి ఆఫీసులో విన్నవించాను కాగితంపై అధికారం బరువు పెట్టమంది అడిగోపుల వెంకటరత్నమ్ కవిత-