
REKKADINANTHA KAALAM
₹200
In stock · 394 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'ఈ నవలంతా చదివిన తర్వాత.. ఒక కష్టజీవికి స్వాతంత్య్రం ఏమిచ్చింది? గత ఏడు దశాబ్దాలలో స్వతంత్రం ఎవరి ప్రయోజనాలను కాపాడింది? ఎవరి ప్రయోజనాలను గాలికొదిలేసింది? ఇలాంటి ప్రశ్నలు అనేకం మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. స్వాతంత్ర్యానంతరం జరిగిన అభివృద్ధిగా పాలకులు పేర్కొంటున్న అభివృద్ధి ఎలాంటిదో ఆలోచించమని ఈ నవల వినయంగా పాఠకులను కోరుతుంది. వలసపాలన మొదలవడంతో ప్రారంభమైన వృత్తుల విధ్వంసం ప్రపంచీకరణతో పరిసమాప్తమౌతున్న నేపథ్యంలో ఈ నవల రావటం కాకతాళీయం కాదు. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 'అన్నంగుడ్డ', 'సానరాయి' వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు... ఈ నవల రాజకీయాల గురించీ, వర్గపోరాటాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. -మధురాంతకం నరేంద్ర