REKKALAGURRAM by DR.RAMANA YASHASWI Telugu book cover

REKKALAGURRAM

by DR.RAMANA YASHASWI

₹80
In stock · 25 available
PublisherDR.RAMANA YASHASWI
LanguageTelugu
రెక్కల గుర్రంలో అనేక విషయాలను, సమస్యలను కవిత్వం చేసిన డా॥రమణ యశస్వి తన జీవితంలోనూ సామాజిక బాధ్యతలకు పెద్దపీట వేశారు. కొన్ని రెక్కల్లో డైరెక్ట్ డాక్టర్ సలహాలిచ్చారు. అవయవదానానికి ప్రాముఖ్యతనిచ్చారు. భౌతికకాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు దానం ఇవ్వడం అన్ని దానాలను మించిన దానంగా, భవిష్యత్ వైద్య విద్యార్థులకు, వైద్యవిజ్ఞానానికి ఎంతో తోడ్పాటు లభించగలదని స్పష్టం చేశారు. ఆయన ఆలోచనా ధోరణిలోనే అంతర్గతంగా ఒక రిలీఫ్ వుంది. అది ఆయన్ని ఏ వైపుకైనా మళ్ళించగలదు. involve చేయగలదు. ఆపరేషన్లు చేయించగలదు. అలాగే కవిత్వమూ రాయించగలదు. -యం.కె. సుగమ్బాబు, రెక్కల రూపశిల్పి కవిత్వ సృష్టికి కావలసిన పరిశీలనాత్మక ప్రతిభ, బలమైన ఆలోచన, స్పష్టమైన అభివ్యక్తి ముప్పేటలుగా వున్న సహృదయులు డా॥రమణ యశస్వి. సమాజంలో వున్న ప్రతి అంశాన్ని 'రెక్కల గుర్రం'లో కవితా వస్తువుగా మలిచిన తీరు 'కాదేదీ కవితకనర్హం' అన్న శ్రీశ్రీ పలుకుల్ని సార్థకం చేస్తుంది. -డా||గుమ్మా సాంబశివరావు ఇది ఒక అశ్వమేధయాగమే. మేధలో జనించిన ఆలోచనలకు అనుభవాల అనుభూతుల రెక్కలిచ్చి తన కవిత్వ జవనాశ్వాలను పాఠక హృదయ మైదానాల్లో పరుగులు తీయిస్తున్నాడు. ఒట్టి మైదానాలేనా? 'అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి' అన్నట్లుగా 'ఆకాశపు దారులంట - హడావుడిగా వెళ్ళిపోయే -అరుచుకుంటూ వెళ్ళిపోయే' రెక్కల గుర్రాన్ని కూడా రెక్కపట్టి మనిషికోసం, మనిషి హితం కోసం సవారీ గుర్రం చేస్తున్నాడు. ప్రతి రెక్కలో విడని భాషాబంధాన్ని, ఆత్మీయతా గంధాన్ని వెదజల్లారు. ఈ రెక్కల గుర్రాన్ని పట్టి చూపడం అంటే యాగాశ్వాన్ని బంధించచూడటమే. -సుధామ డా॥రమణ యశస్వి గారి రెక్కలు అనేక సామాజికాంశాలను మోసుకొస్తున్నాయి. సామాన్య మానవుడిగా లోకం పోకడను, వైద్య వృత్తి నిపుణులుగా మరో ప్రపంచాన్ని చూసే అవకాశం వున్నందున ఆ ప్రపంచంలో ఎదురయ్యే అనుభవాలను కూడా రెక్కలలో పొదివి పట్టారు. -ఎన్.వి.కృష్ణారావు