
REKKALOCHHAAYI
by C.YAMUNA
₹100
In stock · 25 available
PublisherC.YAMUNA
LanguageTelugu
మనసుకు పూచిన కథలు పక్షి రెక్కల్లోని సున్నితత్వం, పూల లలితమైన పరిమళం కలబోసుకుంటే యమున గారి కధలవుతాయి.రాసికన్నా, 'వాసి' ముఖ్యమనుకొనే రచయిత్రిగా ఆమె చేసిన సాహితీ సేద్యంలో తొలిపంట 'రెక్కలొచ్చాయి' కథా సంకలనం! ప్రతి రచయితకి విజిటింగ్ కార్డులాంటివి కథా సంకలనాలు. ఈ సంకలనం లోకి మనం కళ్లు విపార్చి చూసిన తర్వాత, యమునగారికి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తుంది. ఈమె అన్ని 'కోణాలు' సృశించగలదన్న విశ్వాసం కలుగుతుంది. మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని అక్షరబద్దం చేయడానికి ఈమె 'కలం' చూపిన తహ తహ అడుగడుగునా మనల్ని స్పర్శిస్తూనే వుంటుంది. మచ్చుకి కొన్ని కధల్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కథ పేరు 'కాలం-నిర్ణయం'. ఆశ్రమాలకు తల్లినో, తండ్రినో తరలించే సంతానాన్ని ఆలోచనల్లో పడేస్తుంది. ఈ కథ. 'ఇంట్లో చోటిచ్చారు కానీ మనస్సులో ఇవ్వలేదు. కోడలు, కొడుకు మాట్లాడరు.పిల్లల్ని దగ్గరకు రానివ్వరు' ఇటువంటి స్థితిలో ఆ ఇంట్లో వుండడం కన్నా ఆశ్రమమే బెటర్ అనే హృదయగత వేదన ఆ తండ్రి స్వరం నుండి వింటాం. అది ఆయన 'స్వీయ బాధా, సమాజపు బాధా' అన్నది మీరు కథలోకి వెళ్లి చూడాల్సిందే. మరోకథ 'కొత్తకోణం', 'కొన్ని సమస్యలకు పరిష్కారాలు వుండవు. వాటితో 'ఎడ్జెస్ట్' అయ్యి బ్రతకాలి తప్పదు. కొన్ని సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలుండొచ్చో, ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి' కొత్తకోణం కథ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. తన సమస్యలతో సతమతమయ్యే ఒక ఇల్లాలు అనుకోకుండా తారసపడిన ఓ స్త్రీ మాటలకు ఎలా ప్రభావితమయ్యిందో తెలిపే కధ ఇది. తప్పక చదివి తీరాల్సిన కధ ఇది. సమస్యల విశ్లేషణకు ఇది నిజంగా కొత్తకోణమే,