RENDELLA PADNALUGU - 85 by MADURANTHAKAM NARENDRA Telugu book cover

RENDELLA PADNALUGU - 85

by MADURANTHAKAM NARENDRA

₹85
In stock · 421 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
rendella padhnalugu short stories by madhuranthakam narendra 1957లో చిత్తూరుజిల్లా దామల్చెరువు దగ్గరి రమణయ్యగారి పల్లెలో జన్మించిన మధురాంతకం నరేంద్ర ప్రస్తుతం తిరుపతి శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలోని ఆంగ్లశాఖలో ఆచార్యుడుగా పనిచేస్తున్నారు. దాదాపుగా 70 కథలు, 4 నవలలు, చాలా కవితలు, కొన్ని రేడియో నాటికలు, కొన్ని విమర్శనాత్మక వ్యాసాలూ రాశారు. ఆయన కథలు కొన్ని 'కుంభమేళా', 'అస్తిత్వానికి అటూయిటూ...' అనే రెండు కథా సంపుటాలుగా వెలువడ్డాయి. కథా బహుమతి, మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం, జ్యేష్ఠ అవార్డు, పరుచూరి రాజారాం పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారాలతోబాటూ అమెరికా తెలుగు అసోషియేషన్, మెక్సికో లేసెడ్ విశ్వవిద్యాలయాల పురస్కారాలను కూడా పొందారు. మధురాంతకం నరేంద్రలో మొదటినుంచీకూడా అంతరంగ చిత్రణమీద ప్రత్యేకమైన ఆసక్తీ, శ్రద్ధా వున్నాయి. అతని శిల్పం కాలంగడచిన కొద్దీ ప్రతీకాత్మకంగా పరిణితి చెందుతూ వస్తోంది... కథా రచయితగా నరేంద్రకు రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. మొదటిది శిల్పంమీద అతనికున్న నియంత్రణ. రెండవది రచయితగా తనను తాను నిగ్రహించుకోవడం... కథలో పాత్రపోషణకు అవకాశం తక్కువే అయినా, మళ్లీ మళ్లీ జ్ఞాపకంవచ్చే పాత్రల్ని తీసుకుని, వాటిని వస్తునిష్టంగా - ఆబ్జెక్టివ్ పోషిస్తాడు. -వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథకు తుదీమొదలు ముఖ్యంగాదు పొమ్మన్నాడు చెకోవ్. 'ఒక సన్నివేశం జరుగుతున్నప్పుడు తటాలున తలుపుతెరిచి, అంతలోనే మూసివేయడంలాంటిది కథ. తలుపుతీసి మూసివేసేలోపలే ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఇందులోనే టెక్నిక్ అంతా ఉంది' అంటాడు జార్జిలెవిన్. యీ పద్దతిలో తెలుగులో కథలు రాస్తున్నవారిలో నరేంద్ర ముఖ్యుడు. -కోడూరి శ్రీరామమూర్తి నరేంద్ర కథా ప్రపంచం జీవితంలోని బహుళత్వాన్ని పరిచయం చేస్తుంది. వైరుధ్యాల్ని ఆకళింపు చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఆయన కథల్లో సామాజిక జీవితంలోని బహుళపార్శ్వాలు విరాట్రూపంలో ఆవిష్కృతమవుతాయి..... ఆయన కథల్లో వస్తుశిల్పాలను విడదీసి చూడడానికి వీల్లేనంతగా ఐక్యతవుంది..... మరోవిధంగా చెప్పడానికి వీల్లేనిరీతిలో కథను నిర్మించడంలో ఒక శిల్పకారునిలా దర్శనమిస్తాడు నరేంద్ర.... ఆయన కథల్ని చదవడం ఒక ఉద్వేగపూరితమైన అనుభవం. -గుడిపాటి VPH01102076