RENDU AAKASALA MADHYA by SALEEM Telugu book cover

RENDU AAKASALA MADHYA

by SALEEM

₹200
In stock · 3 available
PublisherSALEEM
LanguageTelugu
రెండు ఆకాశాల మధ్య పందొమ్మిదివందల అరవై ఐదవ సంవత్సరం, ఏప్రిల్ నెల... ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖకి కేవలం నాలుగువందల మీటర్ల దూరంలో ఉన్న జోరాఫాం గ్రామం... వంట గదిలోంచి వస్తున్న పరోటాలు కాల్తున్న కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ ఫక్రుద్దీన్ మట్టి గోడలోకట్టిన తన రెండు గదుల యింటిని తృప్తిగా చూసుకున్నాడు. అతనికి ఈ యిల్లంటే ప్రాణం.. ఈ యింటితో అల్లుకుని ఎన్ని జ్ఞాపకాలో.. దాదాపు రెండు వందల ముస్లిం గుజ్జార్ కుటుంబాలు, పాతిక్కి పైగా హిందూ, సిక్కు కుటుంబాలున్న ఆ గ్రామంలోనే అతని బాల్యమంతా గడిచింది. తన చిన్నతనంలో ఆ స్థలంలో ఓ పూరిపాక ఉండేది. తనకు యుక్తవయసు వచ్చాక పాలవ్యాపారం మొదలెట్టాడు. వూళ్లో బర్రెగొడ్లు ఉన్న వాళ్ళ యిళ్ళకెళ్ళి పాలను కొని, క్యాన్లో నింపుకుని రన్బీర్సింగ్ పురాకెళ్ళి అక్కడి హోటళ్ళకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు. అలా కూడబెట్టిన డబ్బుల్తో రెండెకరాల పొలం కొన్నాడు. గుడిసె ఉన్న స్థలంలో మట్టితో యిల్లు కట్టుకున్నాడు. పెళ్ళి చేసుకున్నాడు. రెండు బర్రెగొడ్లని, నాలుగు మేకల్ని కొన్నాడు. పాలవ్యాపారంతో పాటు వ్యవసాయం చేశాడు. రెండు బర్రెగొడ్లు నాలుగయ్యాయి. మరో ఎకరం పొలం కొన్నాడు. ఇప్పుడు ఫక్రుద్దీన్క నలభై ఐదేళ్ళు... ముగ్గురు ఆడపిల్లలు.. యిద్దరు మగపిల్లలు.. ఇద్దరాడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకు పంపించేశాడు. పెద్ద కొడుక్కి కూడా ఏడాది క్రితమే పెళ్ళి చేశాడు. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రన్బీర్సింగురా పట్టణంలో అతను చిన్నా చితకా పనులు చేసుకుంటూ అక్కడే కాపురముంటున్నాడు. చిన్న కొడుకు రషీద్కి, మూడో కూతురు ఫర్హానాకి యింకా పెళ్ళి కాలేదు. ఇద్దరాడపిల్లల నిఖాల కోసం రెండెకరాల పొలంతో పాటు రెండు బర్రెల్ని అమ్మాల్సివచ్చింది. ఓ మేకని జహేజ్తో పాటు రెండో అల్లుడికి కానుకగా యిచ్చాడు. రెండు మేకలు పెళ్ళిళ్ళలో విందు కోసం హలాల్ కాబడ్డాయి. ప్రస్తుతం రెండు బర్రెలు, ఓ మేక మాత్రమే మిగిలాయి. ఆ మేకంటే అతని భార్య ఫౌజియాకు ప్రాణం... దానికి మున్నా అని ముద్దుపేరు పెట్టుకుంది. 'ఫర్హానా పెళ్ళికి అవసరమైతే ఈ యిల్లు అమ్ముకోండి. నాకు అభ్యంతరంలేదు.