
RENDU ANUVADA NATAKAALU RENDU ANUSARANA NATAKAALU
₹200
In stock · 16 available
PublisherSUNKARA KOTESWARA RAO
LanguageTelugu
నా మాట 18వ శతాబ్దం రెండవ భాగం నుండి ఆధునిక యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. మానవుడు విద్యుత్ను కనుగొన్నాడు, ఫొటో ఫిలిము కనిపెట్టాడు. మనిషి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సాహిత్య కళారంగాలలోను, ఈ తరుణంలో అనేక మార్పులు జరిగినాయి. సామాజిక, మానవ శాస్త్రాలలో పరిశోధనలు, సాంకేతిక శాస్త్ర రంగాలలో జరిగిన నూతన ఆవిష్కరణలు మనుషుల ఆలోచనలలోను, ఆచరణలలోను, వైవిధ్యతను తీసుకువచ్చాయి. ఈ వైవిధ్యతే నాటకరంగంలో వచ్చిన "వాస్తవికతా వాదము” (Realism). “ఎమిలీజోలా” అనే ఫ్రెంచి రచయిత మొదటిసారిగా వాస్తవికతా వాదంలో నాటక రచన చేసాడు. అంతకు ముందే "విక్టర్ హ్యుగో” లాంటివారు ఈ వాదనలో రచనలు చేసినా ప్రజలు ఆదరించలేదు. “ఎమిలీజోలా" రచనలను, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులలో చాలా ధైర్యంగా ప్రదర్శించాడు. ఫ్రెంచి దర్శకుడు "ఆండ్రే అంట్వా" (Andre Antoine) ఈ నాటకాలలో రాజుల కథలు లేవు, గ్రాంథిక భాష లేదు, పాటలు నృత్యాలు లేవు, పెయింటింగ్ చేసిన తెరలు లేవు, 19వ శతాబ్దపు రెండవ భాగంలో వున్న సమస్యలు, పాత్రలు, భాష, రంగాలంకరణలతో నాటి సమాజాన్ని అద్దంపడుతూ చూపించారు. ప్రేక్షకులు ఒక అద్భుతాన్ని చూసారు, తమ ప్రక్కింటిలో ఏదో జరుగుతుంటే చూస్తున్నామన్న భావన కలిగింది. క్రమేపి సంప్రదాయ నాటకాలు అంతరించాయి. వాస్తవికతా వాదం రంగస్థలం మీద నాటి నుండి నేటి దాకా దర్శనమిస్తూనే వుంది. తరువాతి కాలాలలో అనేక కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు, ప్రయోగాలు మారుతున్న సమాజంతో పాటు నాటకరంగంలో వస్తున్నాయి. పోతున్నాయి. కాని వాస్తవికతా వాదం మాత్రం ఎక్కడికి పోలేదు. అక్కడే ఉంది. వుంటుంది కూడా.