RENDU PRAPANCHALU by RACHAPALEM CHANDRASHEKARA REDDY Telugu book cover

RENDU PRAPANCHALU

by RACHAPALEM CHANDRASHEKARA REDDY

₹50
In stock · 46 available
PublisherRACHAPALEM CHANDRASHEKARA REDDY
LanguageTelugu
ఒక్కమాట నేను సాహిత్యవిమర్శకుడిని, పరిశోధకుడిని. కవి అవుదామని ఎప్పుడూ అనిపించలేదు. కవిత్వం మీద ఉన్న గౌరవంతోనే నేను కవిత్వ రచనకు దూరంగా ఉండిపోయాననుకుంటాను. విమర్శపట్ల గల గౌరవంతోనే విమర్శకు దగ్గరయ్యాను. 1975లో "అంతరాలు" అనే అంత్యప్రాసల కవిత ఒకటి రాశాను. ఆర్థిక అంతరాలను తెలిపే ఆ కవిత “తిరుపతి శోభ" అనే స్థానిక పత్రికలో అచ్చయింది. అనంతపురంలో ఉద్యోగంలో చేరినాక ఇరాన్లో ఒక సినిమా ధియేటర్కు దుండగులు నిప్పపెట్టిన సంఘటన మీద 'సమాజమా ఆలోచించు' అనే కవిత రాశాను. అది1978 నవంబర్ స్రవంతిలో అచ్చయింది. అప్పట్లో దివిసీమలో సంభవించిన ఉప్పెన మీద ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రాసిన ఒక దీర్ఘ కవిత ఆదర్శంగా ఆ కవిత రాశాను. మళ్ళీ చాలా కాలం కవిత్వానికి దూరంగానే ఉండిపోయాను. సోవియట్ రష్యాలో మార్పులు వచ్చి 70ఏళ్ళ కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయినప్పడు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సదస్సులో నీలం రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రసంగం విని 'ప్రశ్నస్పర్శ' కవిత రాశాను. (ఈ పేరు పెట్టింది నామిత్రుడు కె.ఎం. రాయుడు). ఇది 1990 మే 21న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. 1991 ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లాను పట్టి పీడించిన కరువులు, అప్పట్లో ఆ జిల్లాలో జరిగిన కక్షల హత్యలు, 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల వికృత చేష్టలు నాతో ఎక్కువ కవితలు రాయించాయి. కుల, మత, ప్రాంత ఉద్యమాలు, సంఘర్షణలు కొంతవరకు నన్ను కదిలించాయి. వైజ్ఞానికంగా పురోగమిస్తున్న మనం మతభావాలలో ఇరుక్కొని ఉండే వైరుధ్యాన్ని కొంతవరకు విమర్శనాత్మకంగా రాశాను. అప్పుడప్పుడు నేను చూచిన సంఘటనలు,