RENTALA GAJALLU - GEETHALU (MANTRASALA) by DR.RENTALA SRIVENKATESWARA RAO Telugu book cover

RENTALA GAJALLU - GEETHALU (MANTRASALA)

by DR.RENTALA SRIVENKATESWARA RAO

₹120
In stock · 106 available
PublisherDR.RENTALA SRIVENKATESWARA RAO
LanguageTelugu
డా|| రెంటాల ఓ గజల్ దార్శనికుడు వా రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు నేను చదువుకున్న ASNM గవర్నమెంట్ తెలుగు లెక్చరర్గా ఉండేవారు. మాస్టర్ గారితో చిరకాల పరిచయం. నన్ను ఒక గాయకుడిగా, ఒక నటుడిగా, ఒక నాయకుడిగా కళాశాలలో చూసారు. అరువది కళాశాలలో విద్యాభ్యాసం అనంతరం నేను డా. సి. నారాయణరెడ్డి గారి సళ్ళను పాడుతూ గజల్ శ్రీనివాస్ గా రూపాంతరం చెంది మరలా గజల్ గాయకుడిగా ఆయనకు పరిచయం అయ్యాను. నా గజల్ గానాన్ని అభివ్యక్తిని ఆయన ప్రత్యక్షంగా చూసారు 1995 ఆ తరువాత వారు వ్రాసిన "చేదకుంటే బావి నీరు చెడిపోతుంది...” అన్న గజల్ నాకు పంపారు. అది చదివి ముగ్ధుడను అయిపోయాను. సి. నారాయణరెడ్డి గారి తదనంతరం గజళ్ళను ఆ స్థాయిలో నిలబెట్టగలవారు ఎవరా అని ఆలోచిస్తున్న సందర్భంలో డా. రెంటాల గారు రాసిన ఆ గజల్ నా కంట పడటం, దానిని నేను గానం చేయడం, ఆ తదనంతరం డా॥ రెంటాల గారు, నేను అనేకమార్లు కలుసుకోవడం, ఫోనులో మాట్లాడుకోవడం, ఇలా మా మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫలితం వారు కొన్ని అద్భుతమైన తెలుగు గజళ్ళు రాయడం, ముఖ్యంగా సి. నారాయణరెడ్డి గారు మెచ్చుకున్న గజల్ కవి డా॥ రెంటాల గారు. అనేకమార్లు వాతో డా॥ రెంటాల గురించి, డా॥ తటవర్తి రాజగోపబాలం గురించి గురువుగారు మాట్లాడారు. "వీరిద్దరూ గజల్ని ముందుకు తీసుకు వెళ్తారయ్యా.." అని అంటుండేవారు. > రెంటాల గారితో నాకు ఉన్న ఆత్మీయత వల్ల నేను వారితో ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని గజల్ రాయండి అని చెప్పడం.. వారు దానిపైన గజల్ రాయడం... ఇలా ఎన్నోసార్లు జరిగాయి. అలా పుట్టినవే “ఒక్కసారి ఊరు పోయిరా..”, “చదువుకున్న రోజుల ముచ్చట్లు ఎలా మరచిపోను...", "ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు ఇంత వాన కురుస్తోంది..” ఇలా కొన్ని గజళ్ళు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల వల్ల రాసిన కొన్ని గజళ్ళు, గుహలో ఉండి వారు రాసిన కొన్ని గజళ్ళు.. ఇలా ఓ 40 గజళ్ళు ఇంతవరకు డా॥ రెంటాల గారు రాసారు. ఏదో ఒకటి