
RENTALA KUNALAMMA PADALU
by DR.RENTALA SRIVENKATESWARA RAO
₹50
In stock · 271 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400972
Rentala KUNALAMMA PADAALU by Dr. Rentala Srivenkateswara Rao కూనలమ్మ పదాలు పొందికైన పిట్టల్లాంటివి. చాలా కాలం క్రితం వరకూ పల్లెల్లో చేలవెంటా, తోపుల్లోనూ తిరిగిన పిట్టలు. ఇప్పుడక్కడ ఉన్నట్టులేవు. ఆరుద్ర వాటిని పెంచి మచ్చికచేసుకుని శిష్టభాష మప్పాడు. పట్టణాల పెరడుల్లోనూ తోటల్లోనూ తిప్పాడు.. ఈ కవికి కూడా కూనపిట్టల మీద మక్కువే. అంచేత కొన్నింటిని తనూ పొదిగి, పెంచి, ఇలా తున్నాడు. పిట్టలన్నీ ఒకే రకంవి. కూతలు వేరు. వదులు 'ఆకేసి' ఆయమ్మ అన్నమిడును గదమ్మ చెట్టన్నపూర్ణమ్మ ఓ కూనలమ్మ అని చెట్టుకు నివాళి పడుతుంది ఒక కూనపిట్ట. వలపు కుప్పగ చెయ్యి పగయు మద్యము పొయ్యి తెలుగు ఫిల్ము అనెయ్యి ఓ కూనలమ్మ - అని మన సినిమాలు చూసి నిట్టూరుస్తుంది ఇంకొక పిట్ట ఏమి మనిషో వీడు ఎన్నొ సృష్టిస్ "తాడు మెడకేసుకుంటాడు” ఓ కూనలమ్మ - అని మనిషి తెలివితక్కువతనానికి విసుక్కుంటుంది వేరొకటి. కూనలమ్మ పదం అంతా కలిపి ఎంతా? చిటికెడంత. చదవడం కూడానా? చూస్తేనే అయిపోతుంది. కానీ ఒక్కోసారి అవ్వదు. బహుశా ఎక్కువ సార్లే అవ్వదేమో! 'ఇక్కడేదో నవ్వుతున్నట్టు కనిపిస్తూనే తవ్వుతున్నట్టుందే' అనుకుంటాం. ఉలిక్కిపడి మళ్ళీ చదువుతాం. ఇంక దానికి అవడం అంటూ ఉండదు. మనతోనే ఉండిపోతుంది. ISBN: 978-93-91400-97-2 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 9789391 400972