REPATI POURULU NAITHIKA JEEVANA VYASAVALI by DR.NADELLA RAMAKRISHNA Telugu book cover

REPATI POURULU NAITHIKA JEEVANA VYASAVALI

by DR.NADELLA RAMAKRISHNA

₹65
In stock · 32 available
PublisherDR.NADELLA RAMAKRISHNA
LanguageTelugu
I. అభివందనాలు నేటి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యం క్రమక్రమంగా అంతరించిపోతున్నది. పుస్తకాల స్థానంలో అంతర్జాలం, ఫేస్బుక్, ట్విట్టర్లు వచ్చేశాయి. ఈ దశలో ఎంతో బుద్ధికౌశలంతో రచయితలు శారీరక, మానసిక శ్రమల కోర్చి పుస్తకాలు రాసినా వాటిని ముద్రించటం, పంపిణీ చేయడం వారికి తలకుమించిన భారంగా మారిపోయింది. ఈ పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉత్తమ గ్రంథాల ప్రచురణ నిమిత్తం ఆర్థిక సహాయం చేసే పథకం నిర్వహించడం ఎందరో రచయితలకు కొండంత ఆలంబనగా మారింది. ఏ దేవదేవుడు అందరిని చల్లగా కాపాడుతున్నాడో ఆ దేవుని కరుణాకటాక్షాలు ఈ చిరుపుస్తకంపై ప్రసరించి ప్రచురణ కోసం ఆర్థిక సహాయం పొందే భాగ్యం కలిగింది. కరుణామయుడు, తిరుమల గిరివాసుడు, హృదయవాసుడైన శ్రీ వేంకటేశుని పాదసన్నిధిలో ఈ చిరుపుష్పాన్నుంచి వినమ్రంగా అంకితమిస్తున్నాను. మేఘాలకు చల్లని గాలులు తోడైనట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు, ముఖ్యంగా సప్తగిరి మాసపత్రిక సంపాదకులవారు ఆర్ధిక సహాయ వితరణకు ఎంతగానో తోడ్పడినారు. వారికి సవినయంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రులు, సహాధ్యాయులు ఆచార్య మసన చెన్నప్ప గారు ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివి విలువైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. వారు రాసిన ప్రతిమాటలో విషయ నిపుణత, సద్విమర్శ, ఆదరాభిమానాలు కనిపిస్తాయి. సాహితీ మేరునగధీరులు, విద్వద్వతంసులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖాధిపతియైన వారు నాకెంతో గర్వకారకులు. వారికి నా కృతజ్ఞతాభివందనాలు. నా మరో మిత్రుడు" డా॥ బి.జయరాములుగారు. నేనీపుస్తకాన్ని పరిష్కరించమని కోరగా వారంగీకరించి గ్రహించారు. కానీ విధివశాత్తు వారు ఆసుపత్రిలో చేరడం, శస్త్ర చికిత్స చేయించుకోవడం జరిగింది.