
REPPALENI LOKAM KAVITHVAM
₹50
In stock · 7 available
PublisherGOWTHAM PRACHURANALU
LanguageTelugu
తొలిపొద్దు పాడినపాట పక్క మీద నుంచి చీకటిపిట్ట ఎగిరిపోయింది వేకువ గూట్లో వెలుతురు పిట్ట కన్ను తెరిచింది జగతి రంగస్థలం తెరను తొలగించుకుని వెలుతురు జలపాతమయింది. చీకటి సముద్రంలో పుట్టిన తెల్ల కలువలా వెలుతురు వికసిస్తుంది చీకటి నల్లత్రాచు విడిచిన కుబుసంలా వెలుతురు తళతళా మెరుస్తుంది. మువ్వల చేతికర్ర సాయంతో నడిచే అంధునికి అకస్మాత్తుగా చూపొచ్చినట్టు మహాకాంతి కన్నుల్ని పరవశింపచేస్తుంది రాత్రి అన్నం లేక అలసిపోయి నిద్రించిన పేద బిడ్డల ఆకలినాదంలా పక్షుల కిలకిలలు