REPPAVALCHANI KAPALA by N.VENUGOPAL Telugu book cover

REPPAVALCHANI KAPALA

by N.VENUGOPAL

₹100
In stock · 23 available
PublisherSWECHA SAHITHI
LanguageTelugu
Reppavaalchani Kaapalaa Poetry by N. Venugopal రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక వెల్లువలో తెలుగు కవిత్వంలో కనిపించే అంతర్జాతీయ చారిత్రక దృక్పథం అంత విస్తృతిగా, అంతకన్నా పరిణతితో ఈ కవిత్వంలో కనిపించడం సమకాలీన కవిత్వంలో ఒక ప్రత్యేకత. ఒక్క మాటలో ఈ కవిత్వం చరిత్ర, సమకాలీన సామాజిక శాస్త్రం, సామాజిక ఆర్థిక రాజకీయ దర్పణం, ఈ అన్నింటినీ నడిపించేది కార్మిక వర్గ దృక్పథం, ఎంతో ప్రామాణికమైన ప్రపంచ చరిత్ర అవగాహన. - సృజన్ విప్లవ విరాట పర్వంలోనూ అరణ్య పర్వంలోనూ వేణుగోపాల్ పాత్ర చిన్నదేం కాదు. ఇతను విస్తృతమైన చదువరి. లోక సంచారి. ఇతని ప్రపంచంలో అలజడులూ వున్నాయి. అల్లకల్లోలాలూ వున్నాయి. ఏకకాలంలో లోక విషయాల్ని ఆకళింపు చేసుకోగలడు. మానవీయ కోణం లోంచి వాటికి అక్షర రూపం ఇవ్వగలడు. -ఎండ్లూరి సుధాకర్ వేణూ కవిత్వంలోకి అడుగుపెట్టడమంటే అనేక సామాజిక, చారిత్రక సందర్భాల్లోకి దూకడమే! ఈ కొత్త కవిత్వ సంపుటి కూడా అట్లాంటి వొక social document. అయితే, ఈ కవిత్వంలో వినిపించే ఉద్వేగం వల్ల ఆ document కి తోడైన సజీవమైన మానవ రూపం కూడా కనిపిస్తుంది. -అఫ్సర్