REVERSE GEAR by K.B.KRISHNA Telugu book cover

REVERSE GEAR

by K.B.KRISHNA

₹40
In stock · 271 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శ్రీవారు - వెన్నచెక్కలూ “ఏమోయ్......... ! నీకు ఈరోజు నుండి నేను వంటిట్లో సాయం చేయాలనుకుంటున్నాను. రోజూ నేను ఉదయం ఆఫీసుకు వెళ్ళేవరకూ, సాయంత్రం ఇంటికి వచ్చేక, రాత్రి పడుకునే వరకూ నువ్వు పడుతున్న శ్రమ చూడలేకపోతున్నాననుకో” అన్నారు. శ్రీవారు ఆవేళ ఉదయం బ్రష్ చేసుకోగానే. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు వార్త విన్నదానిలాగా భయం, ఆశ్చర్యంతో అసలే పెద్దకళ్ళేమో నావి, మరింత విప్పారేయి. ఎందుకంటే ఆయన వంటింటి ముఖం చూసి ఎరగరు కాబట్టి. అది చూసి ఆయన... "అదేమిటే బాబూ గ్రామదేవతలాగా కళ్ళు అలా పెట్టేవు? భయమేస్తోంది, ప్రసన్నమైపో” అంటూ నన్ను భుజాలు పట్టుకుని ఊపసాగారు. "స్వామీ మీకు ఈ విధమైన దుర్బుద్ధి పుట్టుటకు గల కారణము ఏమి? అందులకేనా వేసవికాలము ఫిబ్రవరిలోనే వచ్చేసినది?" అంటూన్న నన్ను వింతగా చూస్తూ... "ఇదేనోయ్ ఆడాళ్ళతో వచ్చిన చిక్కు, మగాడేదైనా మంచి పనిచేస్తానంటే, దీని వెనకేదో నిగూఢ రహస్యం వుందని అనుమానిస్తారు. అసలు అసూయ, అనుమానం ముందు పుట్టి, ఆడది తరువాత పుట్టిందనుకో" అంటున్న ఆయన్ను కుడి అరచేత్తో ఆపి-“ఇప్పటికి మన పెళ్ళయ్యాక ఎన్ని వందలసార్లు ఈ మాటలు అన్నారో. ఇక చాలించండి స్వామీ" అన్నాను. అప్పుడు ఆయన "గౌతమబుద్ధుడికి బోధివృక్షం క్రింద జ్ఞానోదయం అయినట్లు, నాకు మీ తమ్ముడింటి నుండి వచ్చేక, గ్లాసులో పంచదార నీళ్ళు, నిమ్మరసం వేసి గిలకొట్టినట్లుగా బ్రెయిన్ వాష్ అయిపోయిందోయ్. ఈ స్త్రీలకు మనం ఏదైనా చేయాలనిపించిందోయ్". "ఇక మీ ఉపన్యాసం ఆపండి. అదీ సంగతి. వాడు నా తమ్ముడండీ. భార్యను ఎలా చూసుకోవాలో బాగా తెలిసినవాడండీ. నా బంగారుకొండ" అంటున్న నా మాటలు ఆపుచేసి - "అయితే నేను?' అంటూ క్వశ్చన్ మార్కు ముఖం పెట్టిన ఆయన్ను “మీరూ మంచివారే! అయితే మా తమ్ముడు ఇంకొంచెం ఎక్కువ మంచివాడు. అయితే ఏమిటంటారు?”. రివర్స్ గేర్