RUBAILU by NAGABHAIRAVA KOTESWARA RAO Telugu book cover

RUBAILU

by NAGABHAIRAVA KOTESWARA RAO

₹50
In stock · 5 available
PublisherNAGABHAIRAVA KOTESWARA RAO
LanguageTelugu
ఒక్కమాట "రుబాయీ అనేది పారశీక పద్యం. ఉమర్ ఖయాం పార శీకంలో రాసిన రుబాయీలకు ప్రపంచ ప్రసిద్ధి చేకూరింది. దాదాపు లోకంలో ఉన్న అన్ని భాషలలోకి ఉమర్ ఖయాం రుబాయీలు అనువదింపబడ్డాయి. ఆ రుబాయీల్లో ఉన్న ఫిలాసఫీ, ప్రేమతత్వం జగత్ప్రసిద్ధాలయ్యాయి. మహాకవి దాశరథి తెలుగులో ఒక ఛందం సృష్టించి రుబాయీలు రాశారు. అయితే అవి ఉమర్ ఖయాంకు అనువాదాలు గాని, అనుసరణలు గాని కావు. సామాజిక పరిస్థితులను కంటెంటుగా తీసుకుని డా॥ దాశరథి వాటిని రచించారు. డా|| దాశరథి నడిచిన బాటలోనే ఛందాన్ని ఉంది, దానికి హ్యూమర్ జోడించి, నేను 1978 ప్రాంతంలో కొన్ని రుబాయీలు రాశాను. అవి జమీన్ రైతు పత్రికలో వచ్చాయి. మళ్ళీ 1985 ప్రాంతంలో యింకా కొన్ని రుబాయీలు రాశాను. అవి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా వచ్చాయి. వాటిలో కొన్నింటిని యిప్పుడ్ పుస్తకంలో ప్రచురిస్తున్నాను. వీటిలో కొన్నింటిని నేను పలు సభల్లో చదివాను. కవి సమ్మేళనాలలో వినిపించాను, ఈ పద్యాలకు కార్టూన్లు సంతరించిపెట్టినవారు శ్రీ శంకూ గారు. వారికి కృతజ్ఞతలు." రుబాయీలు