
RUGVEDA ARYULU
₹150
In stock · 681 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత/ పుస్తకం గురించి రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు, గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు. సుమారు 10 సం||లు సుదీర్ఘకాలాన్ని స్వాతంత్య్ర యోధుడిగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు, హిందూ సన్యాసిగను, ఆర్య సమాజకునిగను, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్దబిక్షువుగను ఈయన పేరుపొందారు. వీరు చేసిన భాషా సేవకు కాశీపండితులు వీరిని 'మహాపండిత్' బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదముల మూడింటిలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు 'త్రిపీఠకాచార్య' బిరుదిచ్చారు. ప్రముఖ హిందీ పండితుడు. మార్క్సిస్టు సిద్ధాంతం దృష్ట్యా, ప్రాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాలను శోధించి అసంఖ్యాకమైన రచనలు చేశారు. వ్యాసాలు రాశారు. వీరు రాసిన ఓల్గా నుంచి గంగకు, దివోదాసు, సింహసేనాపతి రచనలు ఆంధ్రులకు సుపరిచితాలు. ఋగ్వేదం మనదేశంలో తామ్రయుగంలో వచ్చిన గ్రంథం. అంతకు ముందే హరప్పా, మొహంజదారో నాగరికత ఉండేది. గణ వ్యవస్థలో జీవించిన ఆర్యులను, ఏకతాబద్ధ సామంత వ్యవస్థలో నియంత్రించిన ‘సుదాసు' కాలంలో ఈ 'రుక్కులు' వచ్చాయి. ఆనాడు ఆర్యులు భారతదేశంలోనే కాక, వెలుపల కూడా వున్నారు. వేదాలను, పారశీకులు అవేస్తాను పోల్చుకొని అధ్యయనం చేస్తే, ఉభయులకు చాలా సన్నిహిత సంబంధం కనిపిస్తుంది. ఈ దృష్టితో, రుక్కుల ఆధారంగా నాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులను పునర్నిర్మించటానికి చేసిన మహా ప్రయత్నం ఈ గ్రంథం. రాహుల్తో రచనలలో సుప్రసిద్ధమైనవి కొన్ని.... * లోక సంచారి + సింహసేనాపతి జయయౌధేయ *. విస్మృత యాత్రికుడు ఈ మధురస్వప్నం దివోదాసు * ఓల్గా నుంచి గంగకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004