RUGVEDA YADARTHA DARSHANAM - PURANA GADHALU VASTAVALU by DR.G.RAMAKRISHNA - VIVINA MURTHY Telugu book cover

RUGVEDA YADARTHA DARSHANAM - PURANA GADHALU VASTAVALU

by DR.G.RAMAKRISHNA - VIVINA MURTHY

₹300
In stock · 1199 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126306
ప్రపంచ మౌఖిక సాహిత్యంలో ఋగ్వేదానికి విశిష్ట స్థానం ఉంది. కాలక్రమణిక రీత్యాను, విస్తారం రీత్యాను ఋగ్వేద సంహితది అద్వితీయ స్థానం. అయితే ఋగ్వేదం ప్రధానంగా మతగ్రంథమేనా? కాదు. సమకాలీన సమాజపు సంక్లిష్ట, బహుముఖీన సాహితి ప్రతిఫలనంగా మొదటిగా మౌఖిక రూపం తీసుకుంది ఋగ్వేదం. కనుక ఋగ్వేదాన్ని ఒక మతగ్రంథంగానే చూస్తే నాటి సమకాలీన సమాజం, దాని సంక్లిష్టత, బాహుముఖ రూపాలు, వాటి మధ్య ఉండే పరస్పరాశ్రిత సంబంధాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పటివరకు ఋగ్వేదాన్ని మతగ్రంథంగానే చూసిన ప్రధాన స్రవంతి ఒరవడికి భిన్నంగా, ఆ సంహితను చరిత్ర, మానవశాస్త్రం, నరవర్గీకరణ శాస్త్రం, సామాజికశాస్త్రం, తత్వశాస్త్రం, దైవశాస్త్రం, సౌందర్యశాస్త్రం లాంటి బహుముఖ శాస్త్ర కోణాలనుండి రచయిత డాక్టర్ రామకృష్ణ అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఒక ప్రాచీన సంకలనాన్ని ఏవిధంగా అధ్యయనం చేయవలసి ఉంటుందన్న విధానానికి ఒక నమూనాగా నిలిచిన గ్రంథమే ఋగ్వేద యథార్థ దర్శనం.