RUSSIAN SEETHA by KANDUKURI VENKATA MAHALAKSHMI Telugu book cover

RUSSIAN SEETHA

by KANDUKURI VENKATA MAHALAKSHMI

₹100
In stock · 6 available
PublisherKANDUKURI VENKATA MAHALAKSHMI
LanguageTelugu
మనసులోని మాట 'ఆంధ్రాలో పెరగలేదు. వీళ్ళకేం తెలుగొచ్చు' అనే మమ్మల్ని ఈ మాత్రంగా తీర్చిదిద్దిన ఘనత మా తండ్రిగారైన తాళ్ళూరి భాస్కర నారాయణ మూర్తిగారిదే! ప్రతీ రోజూ రాత్రి వేమన, సుమతీ, కృష్ణ శతకాల్లోంచి ఓ పద్యం అప్ప చెప్పించుకుని, కొత్తది చెప్పి అర్ధం చెప్పేవారు. పెద్దబాల శిక్ష, మన తెలుగు సంస్కృతి తెలిపే మరికొన్ని తెలుగు పుస్తకాలనీ తెప్పించి నేర్పించేవారు. అలాగే మంచి మంచి కథలు, పురాణగాథలూ వంటివి చెప్పేవారు. చిన్నప్పుడు నేర్చుకున్నవి మర్చిపోలేము. అనే మాకు ఈనాడు ఎంతో తోడ్పడ్డాయి. మా నలుగురక్క చెల్లెళ్ళల్లో వున్న విద్యల్ని వెలికి తీసి తీర్చిదిద్దిన వ్యక్తి మా తండ్రిగారే! మేం నలుగురం ఆడపిల్లలమే అయినప్పటికీ, మగపిల్లల లాగే పెంచారు. మా అభిరుచిని బట్టి మాకు విద్యల్ని నేర్పించి మాకీపాటి పేరుని సంపాదించి పెట్టిన ఘనత దక్కేదీ ఆయనకే తొలికథ చిన్నప్పుడే జెంషెడ్పూర్ (లోకల్) మాసపత్రిక ప్రవాసిలో ప్రచురితమయి, బహుమతి పొందింది. ఆ తరువాత వ్యాసాలూ, కుట్లూ, అల్లికలూ ఆంధ్రప్రభ, ప్రమదావనంలో ప్రచురితం కావడంతో నా ఉత్సాహం రెట్టింపయింది. తరువాత రష్యానుంచి వచ్చాక అక్కడి వింతలూ, విశేషాలూ రాసాను. అవి నచ్చి 'వనితా జ్యోతి' నన్ను ఢిల్లీ ప్రతినిధిగా వుండమనడంతో సుమారు యిరవైఏళ్ళ పాటు ఢిల్లీలోని ప్రముఖ మహిళల్ని పరిచయం చేసాను. ఇప్పటికి 115 కథలు 90 కి పైగా వ్యాసాలూ, ఇంటర్వ్యూలూ అన్ని పత్రికలలో వచ్చాయి. నా కథలు ప్రచురించిన స్వాతి, ఆంధ్ర పత్రిక, ప్రియదత్త, జ్యోతి, ఆంధ్రజ్యోతి, సురభి, భూమిక, ఆంధ్రప్రభ, వనిత, మహిళ, ప్రభవ ఎడిటర్లందరికీ నా ధన్యవాదాలు. నా కథలు ప్రసారంచేసి, అనేక రూపకాలని రాయించినందుకు ఢిల్లీ రేడియో (ఇ.ఎస్.డి.) వారికి అనేకానేక ధన్యవాదాలు. ఇది పుస్తకంగా రావడానికి ఎంతో తోడ్పడిన డా||వాసా ప్రభావతిగారికి, ఎంతో ఆప్యాయతతో శ్రమపడి నా చేతికి ఈ పుస్తకాన్ని అందించిన ఆమెకి అనేకానేక ధన్యవాదాలు.